Gmail లో కొత్త ఫీచర్, “Block sender”

Gmail లో కొత్త ఫీచర్, “Block sender”

మంగళవారం గూగల్ లేటెస్ట్ గా కొత్త ఫీచర్ యాడ్ చేసింది జి మెయిల్ (యాప్ అండ్ వెబ్) లో. దీని పేరు, "Block Sender". incoming మెయిల్స్ పంపే స్పెసిఫిక్ ఇమెయిల్ అడ్రెస్ లను బ్లాక్ చేస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంతవరకూ ఫిల్టర్స్ క్రియేట్ చేసి block చేసే ఆప్షన్ ఉండేది  జిమెయిల్ లో. అయితే ఇప్పుడు అది డైరెక్ట్ గా ఇచ్చింది. జస్ట్ మెయిల్ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్ లో డ్రాప్ డౌన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది.

దీనితో పాటు ఆండ్రాయిడ్ జిమెయిల్ అప్లికేషన్ లో unsubscribe ఫీచర్ ను యాడ్ చేసింది. ఇంతవరకూ ఇది మెయిల్ లో క్రింద చిన్న అక్షరాలతో ఉండేది. సో ఇప్పుడు డైరెక్ట్ ఆప్షన్ లా రానుంది. ఇది మెయిల్ యాప్  లో 3 డాట్స్ ఉండే more menu లో ఉంటుంది.

ఆండ్రాయిడ్ లో unsubscribe మరియు బ్లాక్ sender ఫీచర్స్ మరో వారం లో వస్తాయి. అయితే ఇండియాలో మాత్రం ఈ రెండు అప్ డేట్స్ వచ్చేసాయి. ప్లే స్టోర్ లో అప్ డేట్ చేయండి చాలు. వెబ్ మెయిల్ లో ఈ రెండూ ఆల్రెడీ ఉన్నాయి. బ్లాక్ చేసిన వారిని సెట్టింగ్స్ లోకి వెళ్లి unblock కూడా చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది గూగల్.

కొన్ని నెలల క్రితం జిమెయిల్ లో undo send అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఇది మీరు అనుకోకుండా తప్పుగా ఎవరికైనా మెయిల్ send చేస్తే, దానిని అవతల వ్యక్తి కి చేరకుండా ఈ ఆప్షన్ పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ పనిచేస్తుంది ప్రస్తుతం.

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo