SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్

HIGHLIGHTS

SBI అకౌంట్ హోల్డర్స్ కి షాకింగ్ న్యూస్

జూలై 1 నుండి కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్

ATM ట్రాన్సక్షన్స్ మొదలుకొని చెక్ బుక్ వరకూ కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్

SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్

భారతదేశ అతిపెద్ద బ్యాంక్ SBI తన అకౌంట్ హోల్డర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. SBI బ్యాంక్ లో అకౌంట్ వున్న కస్టమర్లకు విధించనున్న కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను ప్రకటించింది. ఈ బేసిక్ సర్వీస్ ఛార్జ్ లతో కస్టమర్ల పైన కొత్త భారం పడనుంది. ఇప్పటి వరకూ వున్నా సర్వీస్ ఛార్జ్ లు కాకుండా జూలై 1 నుండి కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను వసూలు చేయనున్నట్లు SBI ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్?

SBI బ్యాంక్ ATM ట్రాన్సక్షన్స్ మొదలుకొని చెక్ బుక్ వరకూ కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను విదిస్తుంది. అంటే, SBI అకౌంట్ తో పాటుగా అందుకొనే ATM కార్డుతో 4 కంటే పైన చేసే నగదు విత్ డ్రా పైన 15 రూపాయలు+ GST ని వసూలు చేస్తుంది. అలాగే, జీరో అకౌంట్ కాకుండా సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి కూడా మినిమమ్ బ్యాలన్స్ మైన్ టైన్ చెయ్యకపోతే కూడా చార్జీలు చెల్లిచాలి.

ఇక చెక్ బుక్ చార్జీల విషయానికి వస్తే, ఇక సంవత్సరానికి గాను 10 చెక్ లీఫ్స్ తో కూడిన చెక్ బుక్ ను SBI ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ చెక్ బుక్ అయిపోయిన తరువాత కొత్త చెక్ బుక్ కావాలంటే మాత్రం కొత్త చెక్ బుక్ కోసం రూ.40 + GST చెల్లించాలి. ఇక 25 చెక్ లీఫ్స్ తో కనుక చెక్ బుక్ కావాలనుకుంటే రూ.75 + GST చెల్లించాలి. ఒకవేళ ఎమర్జెన్సీ చెక్ బుక్ మీకు అవసరమైతే దానికోసం రూ.50 + GST ని బ్యాంక్ కు చెల్లించాలని, SBI తన కొత్త బేసిక్ సర్వీస్ ఛార్జ్ లను వెల్లడించింది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo