గత కొంత కాలంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ కస్టమర్ల కోసం చాలా అలర్ట్ లను జారీ చేస్తోంది. అయితే, SBI అకౌంట్ వాడుతున్న వారు, వారి మొబైల్ ఫోన్లలో కొన్ని యాప్ లను వాడొద్దని హెచ్చరించడం వాటిలో ముఖ్యమైనది. ఎందుకంటే, ఇటీవల ఈ యాప్స్ వాడిన కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. అందుకే, అటువంటి మోసపూరితమైన యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడొద్దని తెలిపింది. అంతేకాదు, ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది.
Survey
✅ Thank you for completing the survey!
విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్ (Anydesk), క్విక్ సపోర్ట్ (Quick Support), టీమ్ వ్యూవర్ (Teamviewer) మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.
అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది
అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి