ఉగాది పండుగ రోజు విడుదలకానున్న శామ్సంగ్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్..!!

ఉగాది పండుగ రోజు విడుదలకానున్న శామ్సంగ్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్..!!
HIGHLIGHTS

తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యడానికి శామ్సంగ్ సిద్దమవుతోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన విడుదల చెయ్యబోతోంది

Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ మరియు సమయాన్ని ఫిక్స్ చేసింది

ఇండియాలో తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యడానికి శామ్సంగ్ సిద్దమవుతోంది. అదే Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన విడుదల చెయ్యబోతోంది. అంటే, ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చేయడానికి తేదీ మరియు సమయాన్ని ఫిక్స్ చేసింది. మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్న ఈ కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన గొప్ప ఫీచర్లతో తీసుకువస్తునట్లు శామ్సంగ్ టీజర్ ద్వారా చెబుతోంది. ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన వివరాలను కూడా ఇప్పటికే వెల్లడించింది. ఆ స్పెక్స్  మరియు ఫీచర్ల వివరాలను గురించి క్రింద చూడవచ్చు.                      

Samsung Galaxy M33 5G: రివీల్డ్ మరియు అంచనా స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ ను ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT LCD ప్యానల్ తీసుకువస్తోంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ ను 5nm ప్రోసెసర్ కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో దాచుకుంది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన  మాడ్యూల్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo