Amazon Offer: సాంసంగ్ గెలాక్సీ M32 5G పైన రూ.3,000 భారీ డిస్కౌంట్ అఫర్
గెలాక్సీ M32 5G ఇప్పుడు Amazon నుండి భారీ అఫర్ తో అమ్ముడవుతోంది
రూ.3,000 రూపాయల డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది
ఇటీవల ఇండియాలో విడుదలైన సాంసంగ్ 5G స్మార్ట్ ఫోన్
ఇటీవల ఇండియాలో విడుదలైన సాంసంగ్ 5G స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M32 5G ఇప్పుడు అమెజాన్ నుండి భారీ అఫర్ తో అమ్ముడవుతోంది. ఆకర్షణీయమైన డిజైన్, Dimensity 720G SoC మరియు 48MP క్వాడ్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి ఈరోజు రూ.3,000 రూపాయల డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ లేటెస్ట్ శాంసంగ్ 5G ఫోన్ 12 5G బ్యాండ్స్ కి మద్దతు ఇస్తుంది. మరి ఈ గెలాక్సీ M32 5G పైన అమెజాన్ అఫర్ చేస్తున్న ఆ డిస్కౌంట్ అఫర్ ఏమిటో చూద్దామా.
SurveySamsung Galaxy M32 5G: ధర మరియు ఆఫర్లు
గెలాక్సీ M32 5G బేసిక్ వేరియంట్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 రూపాయలు. అయితే, అమెజాన్ నుండి ఈరోజు Rs.3,000 డిస్కౌంట్ కూపన్ అఫర్ తో పాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు Citi బ్యాంక్ డెబిట్&క్రెడిట్ కార్డ్స్ పైన 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. Buy From Here
Samsung Galaxy M32 5G: స్పెసిఫికేషన్స్
ఈ శాంసంగ్ ఫోన్ 6.5 అంగుళాల HD+ ఇన్ఫినిటీ V డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ తెలిపింది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 GPU తో జతగా ఉంటుంది మరియు 7nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది మరియు సంవత్సరాల వరకూ OS సపోర్ట్ తో వస్తుందని కూడా శాంసంగ్ వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
గెలాక్సీ M32 5G 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. అయితే, ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను పవర్ బటన్‌తో క్లబ్ చేసి సైడ్‌లో ఇచ్చింది.