Samsung Galaxy A03: డీసెంట్ లుక్స్ తో వచ్చిన ఎంట్రీ-లెవల్ ఫోన్
సాంసంగ్ ఇండియాలో తన ఎంట్రీ-లెవల్ ఫోన్ ను ప్రకటించింది
Galaxy A-సిరీస్ నుండి Samsung Galaxy A03 తీసుకొచ్చింది
గెలాక్సీ A03 డీసెంట్ లుక్ తో కనిపిస్తోంది
అతిపెద్ద టెక్ దిగ్గజం సాంసంగ్ ఇండియాలో తన ఎంట్రీ-లెవల్ ఫోన్ ను ప్రకటించింది. ఈ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించేలా Galaxy A-సిరీస్ నుండి Samsung Galaxy A03 పేరుతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.10,499 రూపాయల ప్రారంభ ధరతో విడుద చేసింది. గెలాక్సీ A03 డీసెంట్ లుక్ తో కనిపిస్తోంది మెరియు డ్యూయల్ కెమెరా, బిగ్ బ్యాటరీతో వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది.
SurveySamsung Galaxy A03:
ఈ లేటెస్ట్ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వస్తుంది మరియు దీని ధర రూ. 10,499 మరియు 4GB+64GB వేరియంట్ కోసం రూ.11,999 ధర నిర్ణయించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Samsung.com, ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
![]()
Samsung Galaxy A03:
సాంసంగ్ గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 – అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ TFT డిస్‌ప్లే మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. భాగంలో V కటౌట్ నోచ్ ఉన్నాయి. గెలాక్సీ ఎ03 ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టిబి వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ నలుపు, నీలం మరియు ఎరుపు రంగులలో లభిస్తుంది.
గెలాక్సీ ఎ03 ఫోన్ Unisoc T606 ఆక్టా-కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టిబి వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపికతో ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది డార్క్ మోడ్ వంటి ఫీచర్లతో One UI 3.1 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ వెనుక సింగల్ డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 48MP మైన్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ వుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరా ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎ03 కోర్ స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.