RRR మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది.. KGF చాఫ్టర్ 2 ఎప్పుడంటే..!!

HIGHLIGHTS

2022 బ్లాక్ బాస్టర్ మూవీ RRR యొక్క OTT డేట్ వచ్చేసింది.

Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ పైన రిలీజ్ కాబోతోంది

KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ డేట్ కోసం దేశవ్యాప్తంగా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు

RRR మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది.. KGF చాఫ్టర్ 2 ఎప్పుడంటే..!!

2022 బ్లాక్ బాస్టర్ మూవీ RRR యొక్క OTT డేట్ వచ్చేసింది. ఈ నెల 20 న ఈ బ్లాక్ బాస్టర్ సినిమా Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ పైన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగట్టడమే కాకూండా 1000 కోట్ల పైగా కలక్షన్స్ సాధించింది. ప్రజలు ఎప్పటి నుండో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎప్పుడు OTT లో వస్తుందా? అని చూస్తున్నారు మరియు వారికీ ఇది గొప్ప శుభవార్తే అవుతుంది. అంతేగాదు, ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ,మరొక సినిమా KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ డేట్ కోసం దేశవ్యాప్తంగా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

RRR :

దర్శక ధీరుడు S S రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు Jr.NTR అద్భుతమైన నటనతో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల గుండెలో  నిలిచిపోయింది. RRR మూవీ మే 20 న Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ కాబోతోంది.  

KGF: చాఫ్టర్ 2

ప్రస్తుతం వస్తున్న రూమర్లు మరియు రిపోర్ట్స్ చెబుతున్నట్లు కనుక జరిగితే, KGF: చాఫ్టర్ 2 సినిమా మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావచ్చు. వాస్తవానికి, KGF: చాఫ్టర్ 2 OTT రిలీజ్ గురించి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా బయటికి రాలేదు. అంతేకాదు, KGF: చాఫ్టర్ 2 ఇప్పటికి ధియేటర్ల వద్ద భారీ కలక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లు వసూలు చేసింది మరియు ఇంకా భారీ కలక్షన్స్ సాధించే అంచనాలతో సాగుతోంది.

ఈరోజు OTT లో విడుదలైన కొత్త సినిమా విషయానికి వస్తే, ది కశ్మిర్ ఫైల్స్ ఈరోజు ZEE 5 నుండి స్ట్రీమ్ అవుతోంది.       

ది కశ్మిర్ ఫైల్స్

ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2022 లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని భారీ కలక్షన్ లతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించింది. ఇక విషయానికి వస్తే, 1990 ల కాలంలో  కశ్మిర్ నుండి అక్కడి పండితులు వలస వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు మరియు వారు ఎదుర్కొన్న సంఘటనలను ఈ చిత్రం చూపించారు. ఈ సినిమా ఈరోజు నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo