దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయి వసూళ్లను సాధించడమే కాకుండా కేవలం 10 రోజుల్లోనే పెద్ద పెద్ద రికార్డులను సైతం అలవోకగా దాటి సాగిపోతోంది. RRR ఈ ఆల్ టైం ఫస్ట్ డే రికార్డ్ లను చెరిపివేసి కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ఇప్పుడు కేవలం 10 రోజుల్లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ నటించిన రోబో 2.0 జీవితకాల కలక్షన్లను మించిపోయి మరొక రికార్డును సొంతం చేసుకుంది.
Survey
✅ Thank you for completing the survey!
రోబో 2.0 లైఫ్ టైం కలక్షన్ 800 కోట్ల రికార్డును RRR సినిమా 10 రోజుల్లోనే సమం చేసింది. మార్చి 25న సినిమా ధియేటర్లలో విడుదలైన RRR సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది మరియు మరింత వసూళ్ల దిశగా కంటిన్యూగా కొనసాగుతోంది. అంతేకాదు, 10 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించిన సినిమాల జాబితాలో అత్యధిక అతిత్వరగా సాధించిన సినిమాగా కూడా RRR సరికొత్త రికార్డు సృష్టించింది. ముందుగా, ఈ జాబితాలో దంగల్, బాహుబలి 2, బజరంగీ భాయిజాన్ మరియు సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే, ఈ సినిమా 10 రోజుల్లోనే 900 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మోరేల్ విజయబాలన్ ట్విట్ చేశారు. ఈ ట్వీట్ నుండి RRR తొమ్మిదో రోజు కలెక్షన్‌ను పంచుకున్నారు. ఈ సినిమా 10 రోజుల్లో టోటల్ కలెక్షన్స్ 901.46 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే RRR మరికొన్ని రోజుల్లోనే మరెవరు అందుకోలేని రికార్డు కలక్షన్ ను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.