RRR: జక్కన సినిమా ఊహకందని వసూళ్లు చేస్తుందా? ఎన్ని థియటర్లలో రిలీజ్ అవుతోందంటే.!!

HIGHLIGHTS

ఓటమి ఎరుగని డైరెక్టర్ SS రాజమౌళి తీసుకువస్తున RRR సినిమా

RRR సినిమా కోసం భారీ ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ నిర్వహించింది

ఈ సినిమా భారీ సంఖ్యలో స్క్రీన్స్ ను పంచుకోనుంది

RRR: జక్కన సినిమా ఊహకందని వసూళ్లు చేస్తుందా? ఎన్ని థియటర్లలో రిలీజ్ అవుతోందంటే.!!

ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ఒకే చర్చ కొనసాగుతోంది. అదే, ఓటమి ఎరుగని డైరెక్టర్ SS రాజమౌళి తీసుకువస్తున RRR సినిమా. ఈ సినిమా అనౌన్స్ చేసిన మొదటి రోజు నుండే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధవుతుండగా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మరియు రిపోర్ట్ లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. కొత్తగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, RRR సినిమా ప్రపంచ వ్యాపంగా 11 వేల కంటే ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పటికే ఈ RRR (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం భారీ ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ నిర్వహించింది. ఎక్కడ చుసినా ఈ సినిమా RRR త్రయం అంటే, రాజమౌళి, రామ్ చరణ్ మరియు రామారావు (Jr.NTR) ఆన్లైన్ ను ఈ సినిమా కోసం నిర్వహిస్తున్న ఆన్ ప్రమోషన్ మరియు ఆఫ్ ప్రమోషన్ వీడియో లతో ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు RRR సినిమా కోసం 10 రోజులు టికెట్ ధరల పెంపు గురించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే RRR సినిమా

ఇక ఉత్తర రాష్ట్రాల్లో (నార్త్ స్టేట్స్) లో అయితే ఎన్నడూ చూడని విధంగా భారీ సంఖ్యతో థియేటర్స్ లో RRR మూవీ విడుదల అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మన దేశంలో మాట ఇలావుంటే, ఇంటర్నేషనల్ గా కూడా భారీ సంఖ్యలోనే స్క్రీన్స్ పైన విడుదల కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్క అమెరికాలోనే 2500 పైగా స్క్రీన్స్ పైన ఈ సినిమా రిలీజ్ అవుతోందని ఒక అంచనా. దుబాయ్, లండన్ మరియు మరిన్ని దేశాలతో కలుపుకుంటే ఈ సినిమా భారీ సంఖ్యలో స్క్రీన్స్ ను పంచుకోనుంది. ఈ అంచనాలను చూస్తుంటే, జక్కన సినిమా ఊహకందని వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఊహసిస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo