సినిమా రేటింగ్స్ మరియు రివ్యూ లకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb) లో RRR మూవీ టాప్ రేటెడ్ మూవీగా నిలిచింది. IMDb మోస్ట్ పాపులర్ మూవీ లిస్ట్ లో 5వ స్థానంలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ రేటింగ్ లో మాత్రం 9.0 టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకుట్టుకుందో ఈ రేటింగ్ చూస్తే తెలుస్తోంది. ఇటీవల ఆస్కార్ ను గెలుచుకున్న CODA తరువాత వరుసలో 5 స్థానంలో RRR నిలవడం నిజంగా గర్వించదగిన విషయం. ఈ సినిమా ఇప్పటికే 900 కోట్ల కలక్షన్ ను సాధించింది మరియు 1000 కోట్ల కలక్షన్ మార్క్ ను కూడా అలవోకగా దాటుతుందని సినిమా గురించి ట్రేడ్ అనలిస్ట్ తేల్చి చెబుతున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
ఇక ట్రేడ్ అనలిస్ట్ మోరేల్ విజయబాలన్ చేసిన ట్విట్ ప్రకారం, ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే 921 కోట్ల కలక్షన్ సాధించినట్లు చెబుతున్నారు. జక్కన సినిమా RRR 10 రోజులకే రోబో 2.0 లైఫ్ టైం కలక్షన్ 800 కోట్ల రికార్డును సమం చేసింది. మార్చి 25న ధియేటర్లలో విడుదలైన RRR కేవలం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది మరియు మరింత వసూళ్ల దిశగా కంటిన్యూగా కొనసాగుతోంది.