ఈరోజు Realme రెండు కొత్త స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది

HIGHLIGHTS

ఈరోజు Realme తన కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తోంది.

Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్

రెండు కొత్త స్మార్ట్ టీవీ లను కూడా లాంచ్ చేస్తోంది

ఈరోజు Realme రెండు కొత్త స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది

ఈరోజు Realme తన కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తోంది. మధ్యాహ్నం 12:30 నిముషాలకు ఈ లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ నుండి Realme X7 Max 5G స్మార్ట్ ఫోన్ తో పాటుగా రెండు కొత్త స్మార్ట్ టీవీ లను కూడా లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ స్మార్ట్ టీవీల మరియు స్మార్ట్ ఫోన్ యొక్క చాలా వివరాలను కూడా వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయనున్న స్మార్ట్ టీవీలు 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ సైజులలో ఉంటాయి. ఈ టీవీ లను Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో తెస్తోంది. అంతేకాదు, కళ్ళకు హాని కలిగించని విధంగా ఈ టీవీ లను TUV Low Blue Light సర్టిఫికేషన్ తో విడుదల చేస్తోంది. ముఖ్యంగా, ఈ టీవీలు పెద్ద సౌండ్ అందించగల 24W క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ తో ఉంటాయని Realme చెబుతోంది.

ఇక  Realme X7 Max 5G విషయానికి వస్తే, ఈ ఈ ఫోన్ గరిష్టంగా 1000 నైట్స్ బ్రైట్నెస్ అందించ గల 100% DCI-P3 వైడ్ కలర్ గ్యాముట్ Super AMOLED డిస్ప్లే ని ఈ ఫోన్ లో అందించింది. ఇది 120Hz అల్ట్రా స్మూత్ రిఫ్రెష్ రేట్ 360 Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ తో వుంటుంది. ఈ ఫోన్ ను 50W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు సన్నని డిజైన్ తో తీసుకువస్తోంది.

Realme X7 Max 5G కెమెరా సెటప్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోనులో వెనుక 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులోని మైన కెమెరాని SonyIMX682 సెన్సార్ తో ఇచ్చింది. దీనికి జతగా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 2MP మ్యాక్రో సెన్సార్ ని ఇచ్చింది.                                                            

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo