Realme Split AC: కేవలం 30 వేలకే కొత్త 1.5టన్ Split AC విడుదల..!!

HIGHLIGHTS

Realme తన TechLife ఎకోసిస్టమ్ లైన్ ద్వారా కొత్తగా Split AC లను పరిచయం చేసింది

ధర కేవలం రూ.27,790 రూపాయల నుండి ప్రారంభమవుతుంది

బడ్జెట్ ను అనుసరించి కావాల్సిన AC ని ఎంచుకోవచ్చు

Realme Split AC: కేవలం 30 వేలకే కొత్త 1.5టన్ Split AC విడుదల..!!

ఇండియాలో Realme తన TechLife ఎకోసిస్టమ్ లైన్ ద్వారా కొత్తగా Split AC లను పరిచయం చేసింది. రియల్ మీ ప్రకటించిన ఈ ఎయిర్ కండిషన్స్ ధర కేవలం రూ.27,790 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త రియల్ మీ స్ప్లిట్ ఎయిర్ కండిషన్స్ (Split AC) లు 1 టన్ మరియు 1.5 టన్ కకెపాసిటీలో, 4 స్టార్ మరియు 5 స్టార్ రేటింగ్ తో వస్తాయి. కొనుగోలు ధరలు సౌకర్యం మరియు బడ్జెట్ ను అనుసరించి కావాల్సిన AC ని ఎంచుకోవచ్చు. మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఎయిర్ కండిషన్స్ యొక్క ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme స్ప్లిట్ AC: ధర

1 టన్ AC, 4 స్టార్ రేటింగ్: రూ.27,790

1.5 టన్ AC, 4 స్టార్ రేటింగ్: రూ.30,999

1.5 టన్ AC, 5 స్టార్ రేటింగ్: రూ.33,490                      

మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎయిర్ కండీషనర్‌ను కొనుగోలు చేయవచ్చు. 

Realme-AC-3.jpg

Realme స్ప్లిట్ AC: స్పెక్స్ మరియు ఫీచర్లు

రియల్ మీ తీసుకువచ్చిన ఈ కొత్త AC లు 4-in-1 కన్వర్టిబుల్ డిజైన్‌తో వస్తాయి. అంటే, మీ అవసరాన్ని బట్టి కూలింగ్ ను 40%, 60%, 80% మరియు 110% కెపాసిటీకి సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఈ AC లు గరిష్టంగా 55 డిగ్రీల వేడిలో కూడా చక్కగా పని చేయగలవని కంపెనీ పేర్కొంది. ఇక మైన్ స్పెక్స్ లోకి వెళితే ఈ AC కాపర్ కాయిల్ తో కూడిన వేరియబుల్-స్పీడ్ కంప్రెసర్ ఉంది. అంతేకాదు, 'తక్కువ విధ్యుత్ వినియోగంతో, గదిని వేగంగా చల్లబరిచే మరియు ఎక్కువ మన్నికమైన కంప్రెసర్' ఇందులో అందించినట్లు కూడా కంపెనీ తెలిపింది.

అలాగే, ఇందులో అందించిన కాయిల్ బ్లూ ఫిన్ యొక్క యాంటీ-కారోసివ్ ఎలిమెంట్‌తో పూత చేయబడింది మరియు ఇది నీటి బిందువులు, ఉప్పు మరియు యాసిడ్  వంటి వాటినుండి రక్షణ కల్పించి ఎక్కువ కాలం మన్నేలా చేస్తుందని కూడా రియల్ మీ చెబుతోంది. ఇందులో, ఏసీ ని దానికదే కేలీన్ చేసుకునేలా Auto Clean ఫీచర్ వుంది మరియు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ R32 కూలెంట్, స్టెబిలైజర్-రహిత ఆపరేషన్ (165~265V పరిధిలో) మరియు సైలెంట్ ఆపరేషన్‌ను వంటివి వున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo