అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంక్ ATM లేదా క్రెడిట్ కార్డ్ యూజర్లకు పిడుగులాంటి వార్త. వచ్చే ఏడాది నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ విత్ డ్రా సర్వీస్ ఛార్జ్ లో పెద్ద మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే, అన్ని బ్యాంకుల ATM ఉపసంహరణ ఛార్జీలను పెంచాలని RBI నిర్ణయించడమే ఇందుకు కారణం. వాస్తవానికి, నెలవారి ఉచిత సర్వీస్ ద్వారా వచ్చే లిమిట్ పూర్తియిన తరువాత, RBI కొత్త నోటికేఫికేషన్ ప్రకారం, గత ఛార్జీ కంటే రూ.1 అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
క్లియర్ గా చెప్పాలంటే, 2022 జనవరి 1 నుండి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నిబంధనలు మారనున్నాయి. ప్రస్తుతం, నెలవారీ ఉచిత సర్వీస్ లిమిట్ ముగిసిన తరువాత ప్రతీ ట్రాన్సాక్షన్ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అయితే RBI కొత్త నిబంధనల ప్రకారం, 2022 జనవరి 1 నుండి లిమిట్ ముగిసిన తరువాత ప్రతీ ట్రాన్సాక్షన్ కోసం రూ.21 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
ఇక కొత్తగా RBI కొచ్చిన ఈ రూల్ గురించి మాట్లాడితే, 2014 ఆగస్టు నుంచి ఈ ఛార్జీల పైన ఎటువంటి మార్పులు చెయ్యలేదని ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాదు RBI ప్రకారం, బ్యాంక్స్ యొక్క అధిక ఇంటర్‌చేంజ్ ఫీజులు మరియు జనరల్ ఎస్కలేషన్ కొరత కారణంగా ఈ చర్య తీసుకోబడింది.
అంటే, కొత్త సంవత్సరం ప్రారభం నుండి మీ బ్యాంక్ ATM/క్రెడిట్ కార్డ్ ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ ముగిసిన తరువాత మీరు విత్ డ్రా చేసే ప్రతి సారి రూ.21 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే, మీ అకౌంట్ నుండి డెబిట్ అవుతుంది