ఇక నుండి డెబిట్ కార్డ్ లు లేకున్నా ATM ల నుండి డబ్బును విత్ డ్రా చేసేలా అన్ని బ్యాంక్ లు సహకరించాలని RBI ప్రతిపాదించినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటిచారు. దీనికోసం బ్యాంకుల ATM లలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందిచాలని కూడా RBI తెలిపింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లేదా UPI ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
Survey
✅ Thank you for completing the survey!
ATM లలో కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా వలన లాభాలు ఏంటి?
ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాల్లో ఎక్కువ జరుగుతున్న కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన మోసాలను నిరోధించడంలో ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సహాయపడుతుంది. దీని గురించి దాస్ ఆయన మాటల్లో "ట్రాన్సాక్షన్ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, అన్ని లావాదేవీలకు ఫిజికల్ కార్డ్ అవసరం లేదు మరియు కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ మొదలైన మోసాలను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది" అని చెప్పారు.
డిడ్ పనిచేసే విధానం దీని పేరులోనే వుంది. కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా అనేది ఎటువంటి ఫిజికల్ కార్డు అవసరం లేకుండా ATM నుండి నగదు విత్ డ్రా చేసేందుకు ఉపయోగపడే సర్వీస్. వాస్తవానికి, ఈ సిస్టం ఇప్పటికే చాలా బ్యాంకుల్లో అమలవుతోంది మరియు అందుబటులో కూడా వుంది. అయితే, ప్రస్తుతం కొన్ని బ్యాంకు లకు మాత్రమే పరిమితం చేయబడింది.
SBI, ICICI Bank, Axis Bank మరియు BOB (బ్యాంక్ ఆఫ్ బరోడా) తో సహా అనేక బ్యాంక్ ల కస్టమర్లు వారి కార్డ్ తో అవసరం లేకుండా ఫోన్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, కస్టమర్లు కార్డ్ కు బదులుగా మొబైల్ బ్యాంక్ యాప్ ని ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. ఇది లబ్ధిదారులు వారి మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది.