UPI Payment: ఇక ప్రతి ఫోన్ తో UPI పేమెంట్ చెయ్యొచ్చు..!!
కొత్త పేమెంట్ సర్వీస్ UPI123PAY ప్రారంభించిన RBI గవర్నర్
ఇక ఫీచర్ ఫోన్ తో కూడా డిజిటల్ పేమెంట్స్ చెయ్యవచ్చు
సింపుల్ గా చెప్పాలంటే ఇక ప్రతి ఫోన్ తో UPI Payment చేయవచ్చు
ఇప్పటి వరకు ఇంటర్నెట్ కలిగిన స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే UPI ప్రెమెంట్స్ చేసే అవకాశం ఉండగా, RBI ప్రకటించిన 'UPI123PAY' కొత్త సర్వీస్ తో ఇక ఫీచర్ ఫోన్ లేదా కీ ప్యాడ్ ఫోన్లతో కూడా యూపిఐ ట్రాన్సక్షన్ చేసుకోవచ్చు. RBI గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ ఈ కొత్త సర్వీస్ ను లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ ద్వారా దాదాపుగా 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్) చెల్లింపులు చేసే అవకాశం దక్కుతుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇక ప్రతి ఫోన్ తో UPI ప్రెమెంట్స్ చేయవచ్చు. అంతేకాదు, డిజిటల్ ప్రెమెంట్స్ చేసే వినియోగదారుల సందేహాలను పరిష్కరించడానికి 24×7 పనిచేసే హెల్ప్ 'DigiSaathi' లైన్ ను కూడా ప్రారంభించింది.
Surveyఈ కొత్త చర్య అందరు డిజిటల్ ప్రెమెంట్స్ సర్వీస్ అందుకునే దిశగా నడుపుతుంది మరియు వారికీ సరైన అవగాహాన అందించడానికి 'డిజీసాథీ' హెల్ప్ లైన్ వారికి సహాయం చేస్తుంది. డిజిటల్ చెల్లింపులకు మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు 14431 లేదా 1800 891 3333 లేదా digisaathi.info లను సంప్రదించవచ్చు.
ఇక కొత్త UPI123PAY సర్వీస్ నుండి పేమెంట్స్ ఎలా చేయాలి అని చూస్తే, ఈ సర్వీస్ ను నాలుగు విధాలుగా ఉపయోగించుకోవచ్చు.
1. యాప్ ఆధారిత ఫంక్షనాలిటీ
2. మిస్డ్ కాల్,
3. IVR
4. ప్రాక్సిమిటీ సౌండ్-బేస్డ్ ప్రెమెంట్స్
యాప్ ఆధారిత ఫంక్షనాలిటీ కోసం స్మార్ట్ ఫోన్ మాదిరిగా ఫీచర్ ఫోన్ లో పనిచేసే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ అప్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే UPI ప్రెమెంట్స్ చెయ్యవచ్చు.
ఇక మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా ప్రెమెంట్స్ చెయ్యడానికి వర్తకులు డిస్ప్లే చేసిన నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. తరువాత వెంటనే పేమెంట్ నిర్ధారించడానికి వారు ఇన్ కమింగ్ కాల్ అందుకుంటారు. మీరు మీ UPI పిన్ ఎంటర్ చేసిన తరువాత మీ పేమెంట్ లేదా ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) తో పేమెంట్ కోసం ముందే నిర్ణయించిన నంబర్ తో సెక్యూర్ పేమెంట్ ను చెయవచ్చు.
చివరిగా ప్రాక్సిమిటీ సౌండ్-బేస్డ్ ప్రెమెంట్స్ విషయానికి వస్తే, ఇది ఏ పరికరంతో అయినా కాంటాక్ట్ లెస్ మరియు ఆఫ్ లైన్ ప్రెమెంట్స్ చేయడానికి సౌండ్ వేవ్స్ ఉపయోగిస్తుంది.