Ola S1 వంటి ఎలక్ట్రిక్ స్కూటీలకు గట్టి పోటీగా Etrance Neo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120Km ప్రయాణించవచ్చు

HIGHLIGHTS

Pure EV హైదరాబాద్ ఆధారిత స్టార్ట్ అప్ కంపెనీ

Pure EV తీసుకువచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Etrance Neo

ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తుంది

Ola S1 వంటి ఎలక్ట్రిక్ స్కూటీలకు గట్టి పోటీగా Etrance Neo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120Km ప్రయాణించవచ్చు

హైదరాబాద్ ఆధారిత స్టార్ట్ అప్ కంపెనీ Pure EV తీసుకువచ్చిన కొత్త  ఎలక్ట్రిక్ స్కూటర్ Etrance Neo మంచి ఫీచర్లను కలిగివుంది. Ola S1 మరియు TVS i Cube వంటి ఎలక్ట్రిక్ స్కూటీలకు దీటుగా ఈ Etrance Neo ఉంటుంది. లేటెస్ట్ గా Pure EV మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు అందమైన కలర్ అప్షన్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, ఫీచర్ల పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపుగా  Ola S1 మరియు TVS i Cube వంటి ఫీచర్లనే కలిగి ఉంటుంది. కానీ, ధర విషయంలో ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ మిగిలిన వాటికంటే చాలా సరసమైనదిగా ఉంటుంది. అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సరసమైన ధరలో సొగసైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Etrance Neo: ధర

Pure EV ఈ ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ.78,999 (Ex-Showroom) ధరతో ప్రకటించింది. అయితే, Ola S1 మరియు TVS i Cube ధరలు ఇంచుమించు 1 లక్ష రూపాయల వరకూ ఉన్నాయి.  

Etrance Neo: ప్రత్యేకతలు

Pure EV అందించిన స్పెక్స్ షీట్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90-120 Km వరకూ ప్రయాణించ గలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 60 KM వరకూ వేగాన్ని అందుకోగలదని కూడా కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ కేవలం 5 సెకన్లలో 0KM  నుండి 40KM వరకూ వేగాన్ని అందుకోగలదు.                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo