ఎండాకాలం మొదలైతే ఇంటిని చల్లగా ఉంచుకోవడం పెద్ద సవాల్ గా మారుతుంది. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కొత్త హిస్టరీ క్రియేట్ చేసే దిశగా సాగుతున్నాయి. చాలామంది ఇప్పుడు స్ప్లిట్ ఏసీ లేదా విండో ఏసీ కంటే కూడా పోర్టబుల్ ఏసీ లు మరియు ఎయిర్ కూలర్స్ వైపు ఎక్కువగా చూస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కారణం, ఇవి సులభంగా ఒక గది నుండి మరో గదికి మార్చుకోవచ్చు మరియు ఫిట్ చేయడం వంటి సమస్యలు కూడా ఉండదు. అయితే, మీ గదికి ఏది బెస్ట్ మరియు మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అవుతోంది తెలుసుకోండి.
సాధారణంగా ఇంటిని బట్టి మనకు తగిన ఆప్షన్ ను మనం గుర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే, ఏరియా, ఫ్లోర్, పరిసర వాతావరణం మరియు మరిన్ని రీజన్స్ ను దృష్టిలో ఉంచుకోవాలి.
పోర్టబుల్ ఏసీ కూడా సాధారణ ఏసీ మాదిరిగానే పనిచేస్తుంది. దీనిలో కూడా కంప్రెసర్ మరియు రిఫ్రిజిరంట్ గ్యాస్ ఉంటాయి. ఇవి గదిలో ఉండే వేడిని బయటకు పంపి చల్లని గాలిని ఇస్తుంది. అయితే, పోర్టబుల్ ఏసీ లకు వేడి గాలిని బయటకు పంపించే పైప్ అవసరం అవుతుంది. ఇది చాలా వేగంగా రూమ్ ను చల్లబరుస్తుంది మరియు మీకు కావాల్సిన ప్లేస్ లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే, ఇది చిన్న గదులకు బాగా పని చేస్తుంది. అంటే, సింగిల్ రూమ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
అయితే, పోర్టబుల్ ఏసీ తో రెండు చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవేమిటంటే, పోర్టబుల్ ఏసీను మైంటైన్ చేయాలంటే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. రెండో ఇబ్బంది ఏమిటంటే, పోర్టబుల్ ఏసీ కొంచెం ఎక్కువగా సౌండ్ చేస్తుంది. స్ప్లిట్ ఏసీ లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా సౌండ్ చేస్తుంది. అయితే, ఎండల్లో ఏసీ మజా పొందాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎయిర్ కూలర్ ఏసీ మాదిరిగా కాకుండా ఎవాపరేషన్ టెక్నాలజీ పై పని చేస్తుంది. అంటే, వేడి గాలిని వాటర్ ప్యాడ్స్ ద్వారా లోపలికి తీసుకుని చల్లని గాలిగా బయటకు పంపుతుంది. పోర్టబుల్ ఏసీ తో పోలిస్తే అంత కూలింగ్ ను ఇది అందించదు. కానీ, ఇది చల్లని గాలి అందిస్తుంది మరియు మనీ సేవింగ్ కూడా చేస్తుంది. ఎయిర్ కూలర్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ శ్రమ మరియు ఖర్చుతో అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఎయిర్ కూలర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అవుతుంది.
ఎయిర్ కూలర్ తో కూడా రెండు ఇబ్బందులున్నాయి. అవేమిటంటే, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు వడగాలులు వీచే సమయంలో ఇది చల్లని గాలి ఇవ్వడం కష్టం అవుతుంది. అలాగే, ఇది ఏసీ మాదిరి చల్లని గాలని అందించదు.
Also Read: ఈ Jio ప్లాన్ తో ఏడాది మొత్తం నెంబర్ యాక్టివ్ గా ఉంటుంది మరియు డేటా ఆన్లిమిటెడ్ లాభాలు పొందొచ్చు.!
మీరు బడ్జెట్ యూజర్ అయితే, మీకోసం ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కూడా ఏసీ గాలి కోరుకుంటే పోర్టబుల్ ఏసీ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.