POCO M4 5G: బడ్జెట్ ధరలో వచ్చిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..!!
ఇండియాలో విడుదలైన POCO M4 5G
Dimensity 700 5G ప్రాసెసర్ వచ్చిన పోకో ఎం4 5జి
బడ్జెట్ ధరలో వచ్చిన POCO M4 5G
పోకో ఈరోజు ఇండియాలో POCO M4 Pro యొక్క డౌన్ గ్రేడ్ వెర్షన్ POCO M4 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రాసెసర్, 50MP కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లతో వచ్చింది. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కోరుకునే వారిని ఆకర్షించేలా ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో పోకో ప్రవేశపెట్టింది. మరి ఈ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను గురించి తెలుసుకుందామా.
SurveyPOCO M4 5G: ధర
POCO M4 5G రెండు వేరియంట్ లలో విడుదల చేసింది. వీటిలో, 4GB+64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 12,999 ధరతో ప్రకటించింది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.14,999 ధరతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ మే 5వ తేదికి Flipkart నుండి జరగనుంది.
POCO M4 5G : స్పెక్స్
ఈ POCO M4 5G ఫోన్ 6.58 అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్ ను పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. వాస్తవానికి, కొన్ని ఇతర Poco స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, ఇది కూడా Redmi Note 11E అని పిలువబడే మరొక Xiaomi ఫోన్‌కి రీబ్రాండ్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.
పోకో ఎం4 5G వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 2MP సెన్సార్ వుంది. ముందుభాగంలో, 8ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 5G స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.