అడిగిన వెంటనే అప్పు!! వడ్డీ కూడా లేదు…పేటిఎం కస్టమర్లకు గుడ్ న్యూస్..!

HIGHLIGHTS

Paytm కస్టమర్లకు గొప్ప శుభవార్త

డబ్బులేని సయంలో చిన్న మొత్తంలో రుణం

పేటిఎం కొత్త పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ లాంచ్

అడిగిన వెంటనే అప్పు!! వడ్డీ కూడా లేదు…పేటిఎం కస్టమర్లకు గుడ్ న్యూస్..!

Paytm కస్టమర్లకు గొప్ప శుభవార్త . అడిగిన వెంటనే అప్పు ఇవ్వడానికి పేటిఎం సంసిద్ధమయ్యింది. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చేతిలో డబ్బులేని సయంలో చిన్న మొత్తంలో రుణం ఆశించే వారికీ పేటిఎం చిన్న మొత్తాన్ని రుణంగా ఇవ్వనుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే, చేతిలో డబ్బులేనప్పుడు చిన్న మొత్తాని పేటిఎం నుండి రుణంగా పొందవచ్చు. కస్టమర్లకు ఇటువంటి గొప్ప సర్వీస్ ను అందించడం కోసం పేటిఎం కొత్తగా పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ పేరుతో కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది మరియు దీని ద్వారా చిన్న మొత్తాన్ని కస్టమర్లకు చిన్న మొత్తాన్ని రుణంగా అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ రుణాన్ని ఇన్స్టాంట్ గా పొందవచ్చు. ఇప్పటికే పేటిఎం నుండి కొనసాగుతున్న 'Buy Now Pay Later' సర్వీస్ కు ఇది మరొక భాగంగా చెప్పవచ్చు. పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ కోసం పేటిఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తో జతకట్టింది. ఈ సర్వీస్ ఎమర్జెన్సి అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత మహమ్మారి కష్టకాలంలో చేతిలో డబ్బు లేనప్పుడు కస్టమర్ల అవసరాలకు ఉయాయోగపడే ఉద్యేశ్యంతో సర్వీస్ తీసుకొచ్చినట్లు పేటిఎం పేర్కొంది. ఈ పేటిఎం మిని సర్వీస్ తో 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకూ చిన్న మొత్తాన్ని రుణంగా పొందవచ్చు.  గ్యాస్ సిలిండర్ బుకింగ్, మొబైల్ ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్ లేదా DTH వంటి చాలా ఇంటి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

పేటిఎం ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ ద్వారా అందించే చిన్న మొత్తానికి సర్వీస్ ఛార్జ్ కానీ వడ్డీని కానీ వసూలు చెయ్యదు. ఈ సర్వీస్ ద్వారా తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లో తిరిగి చెల్లించినట్లయితే ఎటువంటి వడ్డీ ఉండదు. అలాగే ఎటువంటి యాక్టివేషన్ ఫీజ్ లేదా యాన్యువల్ ఫీజ్ కూడా ఉండదు. కానీ, నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజ్ మాత్రం వర్తిస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo