వడ్డీ లేకుండా రుణం…పేటిఎం కొత్త సర్వీస్

HIGHLIGHTS

వడ్డీ లేకుండా ఋణం

ఇన్స్టాంట్ గా చిన్న మొత్తం

కస్టమర్లకు మంచి అవకాశం

వడ్డీ లేకుండా రుణం…పేటిఎం కొత్త సర్వీస్

పేటిఎం వాడుతున్న వారికీ శుభవార్త. కొత్తగా లేదా చిన్న మొత్తంలో రుణం ఆశించే వారికీ పేటిఎం మంచి గుడ్ న్యూస్ తెలిపింది. పేటిఎం కొత్తగా తీసుకొచ్చిన పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ తో చిన్న మొత్తాన్ని రుణం గా అందిస్తుంది. ఈ రుణాన్ని ఇన్స్టాంట్ గా పొందవచ్చు. ఇప్పటికే పేటిఎం నుండి కొనసాగుతున్న 'Buy Now Pay Later' సర్వీస్ కు ఇది మరొక భాగంగా చెప్పవచ్చు. పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ కోసం పేటిఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తో జతకట్టింది. ఈ సర్వీస్ ఎమర్జెన్సి అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుత మహమ్మారి కష్టకాలంలో చేతిలో డబ్బు లేనప్పుడు కస్టమర్ల అవసరాలకు ఉయాయోగపడే ఉద్యేశ్యంతో సర్వీస్ తీసుకొచ్చినట్లు పేటిఎం పేర్కొంది. ఈ పేటిఎం మిని సర్వీస్ తో 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకూ చిన్న మొత్తాన్ని రుణంగా పొందవచ్చు.  గ్యాస్ సిలిండర్ బుకింగ్, మొబైల్ ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్ లేదా DTH వంటి చాలా ఇంటి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

పేటిఎం ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ ద్వారా అందించే చిన్న మొత్తానికి సర్వీస్ ఛార్జ్ కానీ వడ్డీని కానీ వసూలు చెయ్యదు. ఈ సర్వీస్ ద్వారా తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లో తిరిగి చెల్లించినట్లయితే ఎటువంటి వడ్డీ ఉండదు. అలాగే ఎటువంటి యాక్టివేషన్ ఫీజ్ లేదా యాన్యువల్ ఫీజ్ కూడా ఉండదు. కానీ, నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజ్ మాత్రం వర్తిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo