HIGHLIGHTS
Okhi 90 ని విడుదలకు సిద్ధం
Okinawa నుండి వస్తున్న కొత్త ఈ-స్కూటర్
ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం
Okinawa రేపు ఇండియాలో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ e-Scooter ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం డిస్టెన్స్ మాత్రమే కాదు ఈ ఓకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ వేగంలో కూడా గొప్పగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎల్కట్రిక్ స్కూటర్ 90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదని ఒకినావా తెలిపింది.
Surveyఇక Okinawa సహ వ్యవస్థాపకుడు, జితేంద్ర శర్మ కూడా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో Okhi 90 E-Scooter గురించి కొన్ని కీలకమైన వివరాలను వెల్లడించారు. Okhi 90 ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో గరిష్టంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తితో ఉంటుందని తెలిపారు. Okhi 90 భారతదేశంలోని E-Scooter మార్కెట్ ఎల్లలను మార్చబోతోందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ స్కూటర్ లాంచ్ గురించి షేర్ చేసిన ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
ఇక ఈ అప్ కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఓకి 90 వేగంగా ఛార్జ్ చేసేందుకు వీలుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీని కలిగివుంటుంది. అంతేకాదు, ఈ ఇ-స్కూటర్ కనెక్టెడ్ వెహికల్ ఫీచర్స్ మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే 80% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ పేర్కొంది.