మీ వాట్సాప్ నుండే మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!!

HIGHLIGHTS

వాట్సాప్ చాలా ఉపయోగకరమైన ఫీచర్లను కూడా యూజర్లకు అఫర్ చేస్తోంది

ఇప్పుడు వాట్సాప్ లో MyGov చాట్‌బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది

ముఖ్యమైన ID పత్రాలను కూడా మీ Whatsapp నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

మీ వాట్సాప్ నుండే మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!!

అందరికి పరిచయమున్న మరియు అత్యధికంగా ఉపయోగించబడుతున్నమెసేజింగ్ యాప్ Whatsapp. అలాగే, వాట్సాప్ చాలా ఉపయోగకరమైన ఫీచర్లను కూడా యూజర్లకు అఫర్ చేస్తోంది. వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, పెద్ద గ్రూప్ మరియు పెద్ద ఫైల్స్ తో పాటుగా మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లను కలిగివుంది. వీటితో పాటుగా మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఇప్పుడు డిజిలాకర్ సర్వీస్ కు అప్‌లోడ్ చేయగల పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్‌ల వంటి ముఖ్యమైన ID పత్రాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు సహాయం  చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు వాట్సాప్ లో MyGov చాట్‌బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా DigiLocker యాప్ లేదా మరే ఇతర వెబ్‌సైట్‌కి వెళ్లే అవసరం లేకుండానే వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్‌లో ఈ రికార్డులను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, డిజిలాకర్ కోసం కొత్త అకౌంట్ ను క్రియేట్ చెయ్యడానికి  కూడా ఈ చాట్‌బాట్ సహాయపడుతుంది. అంటే, ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా మీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్‌ల వంటి ముఖ్యమైన ID పత్రాలను కూడా మీ Whatsapp నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిజిలాకర్ భారత రవాణా మంత్రిత్వ శాఖ చేత గుర్తింపు పొందింది. అంతేకాదు, దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లేదా RC డిజిటల్ ఫారమ్‌లను చూపించడానికి ప్రజలకు సహాయం చేస్తుంది.

Whatsapp లో డిజిలాకర్ నుండి పత్రాలను డౌన్‌లోడ్ ఎలా చెయ్యాలి.!

1. మీ ఫోన్ లో WhatsApp యాప్ తెరవండి

2. +919013151515 నంబర్ కి "DigiLocker" అని టైప్ చేసి మెసేజ్ పంపండి

3. తరువాత, మీరు DigiLocker అకౌంట్ ను క్రియేట్ చేయడానికి లేదా నిర్ధారించడానికి అప్షన్ లను చూస్తారు

4. ఇది మీకు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది (మీ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత).

5. ఇక్కడ మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా క్లాస్ X, మరియు XII మార్క్ షీట్‌ల వంటి డాక్యుమెంట్ ఎంపికలతో కూడిన Menu ని చూస్తారు.

6. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు  

డిజిలాకర్ ఎన్‌క్రిప్షన్ సురక్షితమైనదని పేర్కొంది మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ లకు మాత్రమే యూజర్‌లకు యాక్సెస్ ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo