మార్కెట్ కాంపిటేషన్ కు తగ్గట్టుగా Meta, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు FB మెసెంజర్‌లో రియాక్షన్ ఆప్షన్ లను మరింతగా పెంచుతోంది. దీనికోసం, భారతదేశం వంటి బిగ్ మార్కెట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 3D Avatar లను విడుదల చేసింది. Meta యొక్క కొత్త అవతార్ లను మీరు స్టిక్కర్స్, GIFs, ఫీడ్ పోస్ట్‌లు, వీడియో Reels మొదలైనవిగా షేర్ చేయవచ్చు. మీరు Facebook యూజర్ అయితే, మీరు మీ కొత్త అవతార్‌ను ప్రొఫైల్ ఫోటో గా కూడా సెట్ చేయవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
మరి ఈ కొత్త 3D అవతార్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా. ఇది చాలా కష్టమైన పనేమీ కాదు, కానీ మీకు మరింత సులభంగా అరమయ్యేలా చెప్పడానికి వీలుగా ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా అందిస్తాను. మరింకెందుకు ఆలశ్యం, మీ 3D అవతార్‌ను ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దామా.
ముందుగా మీ 3D Avatar ని Instagram లో ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దాం.
Instagram సెట్టింగ్ లకు వెళ్లండి
అకౌంట్ ను ఎంచుకోండి
మీ అవతార్ ను ఎంచుకోండి
మీరు ఫీచర్ యొక్క చిన్నవివరణను చూస్తారు. మెటా ఈ 3D అవతార్‌లను "A new way to be you on Instagram" అని పిలుస్తుంది.
తరువాత ‘Get Started' పైన నొక్కండి
తర్వాత మీ స్కిన్ టోన్‌ని ఎంచుకోండి
ఇప్పుడు, మీరు మీకు ఇష్టమైన జుట్టు రంగు, బాడీ రకం, ముఖ ఆకృతి, జుట్టు, మరియు దుస్తులు మొదలైనవాటిని ఎంచుకోవచ్చు.
మీకు కావలసిన విధంగా అన్ని అప్షన్ లను ఎంచుకున్న తర్వాత, Done పైన నొక్కండి
అంతే, ఇక మీ 3D Avatar రెడీ అయిపొయింది. ఇక మీకు మీకు కావాల్సిన వారికీ షేర్ చెయవచ్చు.
మీ 3D Avatar ని Facebook లో ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దాం
ఫేస్ బుక్ లో అయితే ముందుగా Menu అప్షన్ పైన క్లిక్ చేయండి
తరువాత షార్ట్ కట్ లిస్ట్ లో మీకు అవతార్ కనిపిస్తుంది
ఇక తరువాత అవతార్ ప్రాసెస్ అంతా కూడా పైన Instagram 3D Avatar మాదిరిగానే చెయ్యాలి.
తెలుసుకున్నారు కదా మీ ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో మీకు నచ్చిన 3D Avatar ను ఎలా క్రియేట్ చెయ్యాలో. ఇంకేందుకు ఆలశ్యం మీ అవతార్ క్రియేట్ తో మీ స్నేహితులను సర్ప్రైజ్ చేయండి.