Disney+ Hotstar గుడ్ న్యూస్: కేవలం రూ.49కే సబ్ స్క్రిప్షన్
Disney+ Hotstar గుడ్ న్యూస్ ప్రకటించింది
కేవలం రూ.49కే సబ్ స్క్రిప్షన్ అఫర్
కేవలం సెలక్టెడ్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే
Disney+ Hotstar గుడ్ న్యూస్ ప్రకటించింది.కేవలం రూ.49కే సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది కేవలం సెలక్టెడ్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అఫర్ చేస్తున్నట్లు తెలియవచ్చంది. యూజర్లు వారి కార్డ్, Paytm, PhonePe లేదా UPI ద్వారా చెల్లిస్తే రూ. 99 పరిచయ మొబైల్ ఆఫర్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ రూ.49కి అందిస్తోంది. దీని 50% ఇంట్రడక్టరి అఫర్ క్రింద ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు పరిచయం చేస్తోంది మరియు ఇది కేవలం సెలెక్టడ్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని కూడా పేర్కొంది.
Surveyముందుగా, డిస్నీ+ హాట్ స్టార్ కేవలం రూ.399 వార్షిక VIP మెంబర్‌షిప్ ని ప్రకటించి అందిరికి అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ఆ ప్లాన్ రేటును రూ. 499 కు పెంచింది. అయితే, డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ యొక్క మొత్తం కంటెంట్‌ను వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. కానీ, ఈ కంటెంట్ యొక్క నాణ్యత మరియు డివైజ్ కౌంట్ లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్స్ ను రూ. 499 నుండి మొదలుకొని రూ. 1,499 వరకూ ఈ ప్లాన్స్ ను అందించింది.
అయితే, ఇప్పుడు అందరికి డిస్నీ+ హాట్ స్టార్ ప్రతిఒక్కరి బడ్జెట్ లో అందుబాటులో ఉండేలా కొత్త ప్లాన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలో ఒక నెల సబ్ స్క్రిప్షన్ అందించడానికి ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ వినియోగదారులకు రూ. 49 మొబైల్ ప్లాన్‌ను తీసుకురావడానికి పరీక్షిస్తున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్ తన కస్టమర్ సపోర్ట్‌పై తెలిపింది.
అయితే, ఈ ప్లాన్ రూ.49 ప్లాన్ ఎంచుకునే వారికీ ఒక ఆండ్రాయిడ్ డివైజ్ మీద మాత్రమే కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. అంటే, మీ మొబైల్ లేదా ట్యాబ్ లెట్ రెండింటిలో ఒకేసారి లాగిన్ అయ్యే అవకాశం ఉండదు. ఒకేసారి కేవలం ఒక డివైజ్ కి మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుంది.