Nokia T10: బడ్జెట్ ధరలో ట్యాబ్లెట్ లాంచ్ చేసిన నోకియా..!!

HIGHLIGHTS

HMD Global సారధ్యంలోని నోకియా బ్యాక్ టూ బ్యాక్ ట్యాబ్లెట్ లను లాంచ్ చేస్తోంది

ఇండియన్ మార్కెట్లో మరొక ట్యాబ్లెట్ ను కూడా నోకియా జత చేసింది

ఈ కొత్త ట్యాబ్లెట్ ను Nokia T10 పేరుతో తీసుకొచ్చింది

HMD Global సారధ్యంలోని నోకియా బ్యాక్ టూ బ్యాక్ ట్యాబ్లెట్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మరొక ట్యాబ్లెట్ ను కూడా నోకియా జత చేసింది. నోకియా యొక్క ఈ కొత్త ట్యాబ్లెట్ ను Nokia T10 పేరుతో తీసుకొచ్చింది. ఈ నోకియా టి10 ట్యాబ్లెట్ ను కేవలం బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. వాస్తవానికి, రీసెంట్ గా Nokia T21 ను లాంచ్ చేసిన నోకియా వేను వెంటనే నోకియా టి10 ట్యాబ్లెట్ కూడా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ నోకియా ట్యాబ్లెట్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా చూద్దాం పదండి.

Nokia T10: ధర

 నోకియా టి10 ట్యాబ్లెట్ ను రెండు వేరియంట్ లలో నోకియా పరిచయం చేసింది. ఇందులో స్టార్టింగ్ వేరియంట్ 3 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.11,799. ఇక రెండవ వేరియంట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ తో రూ.12,799 ధరతో వచ్చింది. అయితే, త్వరలోనే Nokia T10 (LTE + Wi-Fi) వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు నోకియా తెలిపింది.

Nokia T10: స్పెసిఫికేషన్లు

నోకియా టి10 ట్యాబ్లెట్ 10.36 ఇంచ్ HD డిస్ప్లేని (1280X800 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో కలిగివుంది. ఈ డిస్ప్లే OZO ప్లేబ్యాక్‌కు కూడా మద్దతు కలిగివుంది. ఈ నోకియా టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. నోకియా ప్రకారం, ఇది రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను మరియు మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను అందుకుంటుంది. అంటే, మీరు ఈ టాబ్లెట్‌లో Android 13 మరియు Android 14 కి కూడా మద్దతు పొందుతుంది.

ఇక కెమెరాల పరంగా, ఈ నోకియా ట్యాబ్లెట్ వెనుక 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. ముందు వీడియో కాల్ మరియు సెల్ఫీల కోసం AI సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ టాబ్లెట్ 5250mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు స్టీరియో స్పీకర్లు, 3.5mm జాక్ మరియు USB టైప్-సి పోర్ట్‌ లకు మద్దతు ఇస్తుంది. ఈ నోకియా ట్యాబ్లెట్ UNISOC T606 ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 4GB RAM ను జతగా కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :