నోకియా, BSNL కలిసి 4G, VoLTE సర్వీస్ లాంచ్…

నోకియా, BSNL కలిసి 4G, VoLTE సర్వీస్ లాంచ్…

నోకియా మరియు బిఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఒక నెట్వర్క్ ఆధునికీకరణ ఒప్పొందం కుదుర్చుకున్నాయి , దీని కింద BSNL దేశంలోని పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాలలో 4G మరియు వాయిస్ ఓవర్ LTE సేవలను ప్రారంభిస్తుంది. ఒక అధికారి సోమవారం ఈ సమాచారం ఇచ్చారు.

నోకియా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలో 10 టెలిఫోన్ సర్కిల్ల్లో టెక్నాలజీ ని విస్తరించనుంది . ఈ సర్వీస్ BSNL యొక్క 3.8 కోట్ల  వినియోగదారులకు  ఇది అందుబాటులో ఉంటుంది.

నోకియా సింగిల్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (RAN) సాఫ్ట్వేర్ వాడకం నెట్వర్క్ సంస్థాపన విధానాన్ని సులభతరం చేస్తుంది, తద్వారా BSNL యొక్క కార్యాచరణ వ్యయాన్ని తగ్గించి, అదే రేడియో యూనిట్ నుండి 2G, 3G మరియు 4G వినియోగదారులకు సేవలను అందిస్తుంది.  కొత్త VoLTE సేవలు BSNL యొక్క 4G కస్టమర్లకు HD నాణ్యత వాయిస్ మరియు ఫాస్ట్ కాల్ కనెక్షన్లను అందిస్తుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo