మీ నంబర్ కు ఈ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి… ఎందుకంటే..!

HIGHLIGHTS

స్పామ్ మెసేజ్ ద్వారా కొత్త స్కామ్

మీకు వచ్చే OTP లను ఎట్టిపరిస్థితుల్లోను మరొకరితో షేర్ చెయ్యకండి

చిన్న మెసేజ్ అనుకుంటే మీ అకౌంట్ ఖాళీ

మీ నంబర్ కు ఈ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి… ఎందుకంటే..!

మహమ్మారి సమయంలో ఆన్లైన్ చెల్లింపులు చాలా కీలకపాత్ర వహించాయి. అయితే, అనేక ఆన్‌లైన్ మోసాలు కూడా పుట్టుకొచ్చాయి. ఇవి ప్రజలకు చాలా హాని కలిగిస్తున్నాయి. కొత్త స్కామ్ గురించి జాగ్రత్తగా ఉండాలని గతకొంత కాలంగా చాలా మంది నిపుణులు టెలికాం వినియోగదారులు ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. KYC వెరిఫికేషన్ అని చెప్పబడే ఒక స్పామ్ మెసేజ్ ద్వారా కొత్త స్కామ్ కు పాల్పడుతున్నట్లు సూచించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ మెసేజ్ కు రెస్పాండ్ అవ్వకపోతే 24 గంటల్లో మీ నంబర్ బ్లాక్ అవుతుందని ఈ SMS లో ఉంటుంది. Airtel, Vodafone, Idea మరియు Jio యూజర్లు కూడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో KYC వెరిఫికేషన్ కోసం అంటూ చెప్పబడే నకిలీ మెసేజెస్ అందుకుంటున్నారు. ట్విటర్ సాక్షిగా చాలామంది వినియోగదారులు ఈ విషయం గురించి వెల్లడించారు.

ఎయిర్టెల్ నంబర్ కలిగిన కస్టమర్లు, వారి మొబైల్ నంబర్ కు 9114204378 నంబర్ నుండి 0 అనే మెసేజ్ అందుకుంటున్నారు. లోపలికి వెళితే అందులో, 'డియర్ ఎయిర్టెల్ కస్టమర్, ఈ రోజు మీ సిమ్ నిలిపివేయబడుతుంది. మీ SIM కార్డు ను అప్డేట్ చేసుకోండి' దీని కోసం మీరు వెంటనే 8582845285 కాల్ చేయండి, అని ఉంటుంది. అంతేకాదు, మీరు వెంటనే సంప్రదించగా పొతే మీ సిమ్ బ్లాక్ అవుతుందని కూడా చూపిస్తుంది.

ఈ రకమైన మేసేజెస్  ద్వారా వినియోగదారుల దృష్టి మరల్చడం మరియు వారు రెస్పాండ్ ఇచ్చినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. ఈవిధంగా వారి నుండి వివరాలను రాబట్టి వారి బ్యాంకుల నుండి డబ్బును విత్ డ్రా చేయడం జరుగుతోంది.

అందుకే, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాల మంచిది. ఆన్లైన్ మాసాలకు ముఖ్యంగా కావాల్సింది 'OTP' కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చే OTP లను ఎట్టిపరిస్థితుల్లోను మరొకరితో షేర్ చెయ్యకండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo