కోవిడ్-19 కొత్త టెస్ట్: గాలి ఊదితే చాలు కరోనా రిజల్ట్ చెప్పేస్తుంది

HIGHLIGHTS

కోవిడ్-19ని సులభంగా గుర్తించడంలో సహాయపడే కొత్త టెస్ట్

ఇది ఒక విధమైన బ్రీత్‌లైజర్ మరియు దీన్ని Bubbler అని పిలుస్తున్నారు

ఈ కొత్త పద్దతిని బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తీసుకొచ్చారు

కోవిడ్-19 కొత్త టెస్ట్: గాలి ఊదితే చాలు కరోనా రిజల్ట్ చెప్పేస్తుంది

ప్రపంచం ఇప్పటికి కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూనే వుంది. అందుకే, శాస్త్రవేత్తలు కోవిడ్-19ని సులభంగా గుర్తించడంలో సహాయపడే ఒక టెస్ట్ ను అభివృద్ధి చేశారు. ఇది ఒక విధమైన బ్రీత్‌లైజర్ మరియు దీన్ని Bubbler అని పిలుస్తున్నారు. ఈ కొత్త పద్దతిని బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తీసుకొచ్చారు. దీనితో చాలా సులభంగా కోవిడ్-19 ని గుర్తించవచ్చని ఈ పరిశోధకులు వివరించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ బ్రీత్‌లైజర్ ను రోగులు దాదాపు 15 సెకన్ల పాటు ట్యూబ్‌లోకి ఊదవలసి ఉంటుంది. తరువాత, ఎంజైమ్స్ కలయిక రివర్స్ RNA ను DNA లోకి ట్రాన్స్‌క్రైబ్ చేస్తుంది. దీని వలన ఆరోగ్య సంరక్షణ కార్మికులు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడం చాలా సులభం అవుతుంది. ప్రస్తుతం ప్రామాణికంగా సాగుతున్న నాసికా రంద్రాల ద్వారా చేసే టెస్ట్ అసౌకర్యవంతంగా ఉన్నా కూడా మరొక మార్గం లేక పోవడంతో దాన్నే ఆచరించవలసి వస్తోంది.

అయితే, ఈ బ్రీత్‌లైజర్ టెస్ట్ మాత్రం ఎటువంటి నాసికా రంద్ర క్లీనింగ్ అవసరం లేకుండా రోగి యొక్క శ్వాస ద్వారా వైరల్ కణాలను కొలుస్తుంది. వాస్తవానికి, కోవిడ్-19 సాధారణంగా వాయుమార్గం ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి, రోగి శ్వాసలోని కణాలను కొలవడం కూడా మరింత అర్థవంతంగా ఉంటుంది. అంతేకాదు, ఈ టెస్ట్ ద్వారా శ్వాసకోశ సమస్యలపై మరింత సమాచారం కూడా అందించవచ్చని కూడా పరిశోధకులు తెలిపారు.

ఈ టెస్ట్ కనుక మాస్ మార్కెట్‌కి చేరుకుంటే, ఎయిర్‌ పోర్ట్‌లు మరియు వందల కొద్దీ ప్రజలు గుమిగూడే ఇతర ప్రాంతాలలో దీనిని సులభంగా ఉపయోగించడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి, ఈ కొత్త పరీక్ష గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పటి వరకూ ఇది రియల్ మార్కెట్ ని చేరుకుంటుందో వేచిచూడాలి. కానీ, ఇలాంటి కొత్త ఆవిష్కరణలు మనల్ని ప్రకాశవంతమైన, వైరస్ రహిత భవిష్యత్తులోకి నడిపించగలవు.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo