Moto G52: ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ నుండి Moto G52 డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది

1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందుబాటులో వుంది

ఈ ఫోన్ ను మునుపెన్నడూ చూడనంత తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది

Moto G52: ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

మోటరోలా ఇటీవల ప్రకటించిన Moto G52 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. బడ్జెట్ ధరలో pOLED డిస్ప్లే, క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరా, బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి మరింత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ కూడా అందుబాటులో వుంది. అంటే, ఈ ఫోన్ ను మునుపెన్నడూ చూడనంత తక్కువ ధరకే కొనుగోలు చేసే వీలుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G52: ధర మరియు ఆఫర్లు

మోటో జి52 స్మార్ట్ ఫోన్ 4GB మరియు 64GB మోడల్ రూ.14,499 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, Flipkart నుండి ఈరోజు రూ.1,500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.12,999 రూపాయల ధరలో లభిస్తోంది. అంతేకాదు, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారు రూ.1,000 వరకూ తగ్గింపు పొందవచ్చు. అంటే, ఈ అన్ని ఆఫర్లను అందుకుంటే ఈ ఫోన్ ను కేవలం రూ.11,999 రూపాయల ధరలో అందుకోవచ్చు.      

Moto G52: స్పెక్స్

మోటో జి52 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లేని కలిగివుంది మరియు ఈ డిస్ప్లే పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి52 యాడ్-ఫ్రీ Android 12 OS పైన నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో మెమొరీని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫిక్షన్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్  ఉన్నాయి మరియు ఇది మూడు కెమెరాలతోనే నాలుగు కెమెరాల పనిచేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 33W టర్బో పవర్  ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్,ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo