Android స్మార్ట్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏమిటో తెలుసా..!!

HIGHLIGHTS

Android స్మార్ట్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్

యూజర్లు వారికీ తెలియకుండ కొన్ని తప్పులు

అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారే చేస్తుంటారు

Android స్మార్ట్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏమిటో తెలుసా..!!

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, Android స్మార్ట్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏమిటో తెలుసా. తెలియక పొతే ఈరోజు మీరు వాటిని గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకోవచ్చు. వాస్తవానికి, స్మార్ట్ ఫోన్ లేకుండా ఈరోజుల్లో ఒక్క క్షణం కూడా గడవదు. అదేసమయంలో ఫోన్ వాడే సమయంలో చాలా మంది యూజర్లు వారికీ తెలియకుండ కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ తప్పుల్లో అత్యధికంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారే చేస్తుంటారు. అందుకే, ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్స్ గురించి ఈరోజు చూడబోతున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బ్యాకప్ చెయ్యకపోవడం 

బ్యాకప్ చెయ్యకపోవడం అనేది చాలా కామన్ మిస్టేక్. చాలా మాది వారి ఫోన్ ను బ్యాకప్ చేయకుండానే వాడుతుంటారు. అయితే, ఫోన్ పోగొట్టుకున్నా లేక ఏదైనా సమస్య కారణంగా ఫోన్ పనిచెయ్యకపొతే మీ డేటా మొత్తాన్ని పోగొట్టుకుంటారు.        

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడింగ్

Google Play Store నుండి కాకుండా మరింకెక్కడి నుండైనా యాప్స్ డౌన్ లోడ్ చేస్తుంటారు. అవే 'థర్డ్ పార్టీ యాప్స్' మరియు వీటిని అవసరాన్ని డౌన్ లోడ్ చేసుకోని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సాధారణ విషయం మాత్రం కాదు మరియు ఇది తర్వాత మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అందుకే, సెట్టింగ్స్ లో ఉన్న యాప్ మెనూలో అన్నోన్ యాప్స్ ఇన్స్టాలేషన్ ఎంపికను ఆఫ్ చేయాలి.

యాప్ డోన్ లోడ్ సమయంలో అజాగ్రత్త

ఒక యాప్ డోన్ లోడ్ సమయంలో మీరు మీ ఫోన్ అనుమతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే, చాలా యాప్స్ మీ కాంటాక్ట్ లిస్ట్, మెసేజెస్ మరియు స్టోరేజ్ కోసం అనుమతిని కోరతాయి. ఇక్కడ మీరు శ్రద్ద వహించకపోతే నష్టపోతారు.            

ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం

ముఖ్యంగా, ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ మీకు సులభంగా మరియు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అయితే, ఫోన్ అన్లాక్ కోసం సమర్ధవంతమైన మరియు బలమైన పాస్వర్డ్ ఉంచడం మంచిది.

యాప్ ను ఇన్‌స్టాల్ చేయడానికి APK ఫైల్ ఉపయోగించడం

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని ఎన్నో యాప్స్ కూడా వెలుపల ఉన్నాయి. వాటికోసం APK ఫైల్ డౌన్ లోడ్ చేసుకొని దానిద్వారా ఆ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ, ఇది గూగుల్ ప్లే స్టోర్ ఆమోదించబడనందున ఇది ప్రమాదకరం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo