Microsoft సర్వర్లలో భారీ అంతరాయం: Outlook, Teams, Copilot సహా పలు సేవలకు బ్రేక్!

Highlights

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు ఉపయోగిస్తున్న ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు

మెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఇన్‌ బాక్స్ ఓపెన్ చేయడం వంటి పనులు చేయలేకపోతున్నామని యూజర్ల ఫిర్యాదు

Outlook, Microsoft 365, Teams మరియు Copilot సహా పలు సేవల్లో కనెక్టివిటీ సమస్యలు

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు ఉపయోగిస్తున్న వేలాది మంది యూజర్లు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Outlook, Microsoft 365, Teams మరియు Copilot సహా పలు సేవల్లో కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఇన్‌ బాక్స్ ఓపెన్ చేయడం వంటి పనులు చేయలేకపోతున్నామని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. నవంబర్ 12 న ప్రారంభమైన ఈ అంతరాయం నవంబర్ 13 ఉదయం కూడా కొనసాగుతున్నట్లు ప్రముఖ ఔటేజ్ ప్లాట్ ఫామ్ లో డౌన్ డిటెక్టర్ అందుకున్న రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Microsoft సర్వర్లలో భారీ అంతరాయం

మైక్రోసాఫ్ట్ పనిచేయడం లేదని మరియు సర్వీసులో పెద్ద అంతరాయం ఏర్పడిందని యుజర్లు ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేస్తున్నారు. నవంబర్ 13వ తేదీ అనగా నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు ఈ సర్వీస్ అంతరాయం కొనసాగినట్లు చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం కూడా ఈ సర్వీస్ లోపం ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ భారీ అంతరాయానికి కలిగిన లేదా దారి తీసిన కారణాలు ఏమిటి అని కంపెనీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

ఏయే మైక్రోసాఫ్ట్ సేవలు ప్రభావితం అయ్యాయి?

ఈ అంతరాయం కారణంగా మైక్రోసాఫ్ట్‌ కు చెందిన పలు క్లౌడ్, ఆఫీస్ సేవల పై ప్రభావం పడింది. ప్రధానంగా Outlook ఈమెయిల్ సేవలో సమస్యలు ఎక్కువగా నమోదయ్యాయి. యూజర్లు తమ మెయిల్ అకౌంట్లను యాక్సెస్ చేయలేకపోవడం, కొత్త మెసేజ్‌ లు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు చూస్తున్నట్లు చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile