Mi యానివర్సరీ డేస్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్&టీవీల పైన బెస్ట్ డీల్స్

Mi యానివర్సరీ డేస్ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్&టీవీల పైన బెస్ట్ డీల్స్
HIGHLIGHTS

షియోమి యానివర్సరీ డేస్ సేల్

స్మార్ట్ ఫోన్స్&టీవీల పైన బెస్ట్ డీల్స్

10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

షియామి సంస్థ ప్రారంభించి ఏడు సంవత్సరాలు అవుతోంది. అందుకే, కంపెనీని ఇంతగా ఆదరించిన కస్టమర్ల కోసం మంచి డీల్స్ ప్రకటించింది. Mi యానివర్సరీ డేస్ సేల్ పేరుతో ప్రకటించిన ఈ సేల్ జూలై 12 నుండి జూలై 16 వ తేదీ వరకూ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి కొనుగోలుదారులు షియామి ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ తో సహా అనేకమైన లాభాలను పొందవచ్చు. ఈ సేల్, అమెజాన్ ఇండియా మరియు mi.com నుండి అందుబాటులో వుంటుంది.

Mi యానివర్సరీ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్&టీవీల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ టీవీల పైన గరిష్టంగా 11,000 రూపాయల వరకూ భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ల ఐన కూడా ఆకర్షణీయ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. అధనంగా, SBI బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ షియోమి అభిమానులకు మంచి ఆఫర్లను అందుకుందుకు వీలు కల్పిస్తుంది. Check Offers Here

ఇక ఈ Mi యానివర్సరీ సేల్ నుంచి లభిస్తున్న టాప్ డీల్స్ గురించి చూస్తే, రెడ్‌మి 9 ఎ స్మార్ట్ ఫోన్‌ను కేవలం 6,799 రూపాయల చవక ధరకు పొందవచ్చు. ఇది దాని అసలు ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కాకుండా, షియోమి మి 10 టి ప్రో ఫోన్ ని రూ .47,999 కు బదులుగా రూ .36,999 రూపాయల ధరకే పొందవచ్చు. అంతేకాదు, మీరు మి 10 టి కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుంది.   ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ .34,999 కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo