Instagram Account లో మీ వయసు దాచిపెడుతున్నారా .. ఈ Meta AI కొత్త టెక్ తో కష్టాలే.!
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు మరియు టీనేజర్ల ఆన్ లైన్ భద్రతపై Meta కీలక నిర్ణయం
వయసు దాచిపెట్టి 18 ఏళ్లు నిండిన వారిలా అకౌంట్ లను క్రియేట్ చేస్తున్న టీనేజర్లను గుర్తించేందుకు AI ఆధారిత టెక్నాలజీ
అకౌంట్ క్రియేషన్ కోసం ఫేక్ పుట్టిన తేదీ నమోదు చేసిన వారిని గుర్తించేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు మరియు టీనేజర్ల ఆన్ లైన్ భద్రతపై Meta కీలక నిర్ణయం తీసుకుంది. Instagram Account లో తమ అసలు వయసు దాచిపెట్టి 18 ఏళ్లు నిండిన వారిలా అకౌంట్ లను క్రియేట్ చేస్తున్న టీనేజర్లను గుర్తించేందుకు AI ఆధారిత టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు మెటా వెల్లడించిన ఈ నిర్ణయంతో లక్షలాది మంది టీనేజర్లు ఆటోమేటిక్ గా Instagram Teen Account ప్రొటెక్షన్స్ పరిధిలోకి రానున్నారు. ముఖ్యంగా, 13 నుంచి 17 ఏళ్ల వయసున్న వారు అకౌంట్ క్రియేషన్ కోసం ఫేక్ పుట్టిన తేదీ నమోదు చేసిన వారిని గుర్తించేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
Instagram Account ఫేక్ ఏజ్ కనిపెట్టే AI టెక్
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని మెటా కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో అకౌంట్ కోసం తమ ఏజ్ ని ఎక్కువగా నమోదు చేస్తున్నట్లు మెటా గుర్తించింది. అందుకే, అటువంటి అకౌంట్లను కనిపెట్టడానికి మెటా కొత్త ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.
AI టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
- ప్రొఫైల్ పరిశీలన: యూజర్ బయో, పోస్టులు, క్యాప్షన్లు, కామెంట్ లోని సమాచారాన్ని AI విశ్లేషిస్తుంది.
- పుట్టినరోజు వివరాలు: బర్త్ డే సెలబ్రేషన్లు, స్కూల్ క్లాస్, విద్యార్థి జీవితానికి సంబంధించిన వివరాల ద్వారా వయసును అంచనా వేస్తుంది.
- ఫోటోలు అండ్ వీడియోల విశ్లేషణ: కొన్ని ప్రాంతాల్లో ఫోటోలు మరియు వీడియోల్లో కనిపించే సాధారణ దృశ్య సంకేతాలను పరిశీలించి వయసును అంచనా వేస్తుంది. ఇది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కాదని గమనించాలి.
- AI ఆధారిత గుర్తింపు: యూజర్ నమోదు చేసిన పుట్టిన తేదీకి మరియు ఇతర వివరాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఏఐకి ఆ అకౌంట్ ని టీనేజర్ అకౌంట్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.
- Teen Account ప్రొటెక్షన్: టీనేజర్ గా గుర్తించిన అకౌంట్లకు ఆటోమేటిక్ గా ప్రత్యేక భద్రతా పరిమితులు వర్తిస్తాయి.
టీనేజర్లకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది?
ఈ విధానంలో భాగంగా గుర్తించిన టీనేజర్ల అకౌంట్ లో ప్రైవేట్ అకౌంట్ సెట్టింగ్స్, అపరిచితుల నుంచి మెసేజ్ లపై పరిమితులు, అనుచిత కంటెంట్ నియంత్రణ మరియు యాప్ వినియోగ సమయం పై ప్రత్యేక సదుపాయాలు అందుతాయి. ఇప్పటికే అమలులో ఉన్న టీన్ అకౌంట్ భద్రతా ఫీచర్లను మరింత మంది టీనేజర్లకు అందించడమే Meta లక్ష్యంగా పేర్కొంది. Facebook లోనూ ఈ టెక్నాలజీని విస్తరిస్తుంది మరియు Threads లో కూడా ఈ ఏడాది తర్వాత ఇలాంటి రక్షణ తీసుకురావాలని యోచిస్తోంది.
మరి కష్టాలు ఏమిటి?
ఇప్పటి వరకు టీనేజ్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉన్నా కూడా 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లు వయసును మార్చి అకౌంట్ క్రియేట్ చేసి ఇష్టమొచ్చిన కనేంట్ క్రియేట్ చేయడం లేదా షేర్ చేయడం అలవాటుగా మారిన వారికి అకౌంట్ పై టీన్ అకౌంట్ భద్రతా సెక్యూరిటీ ఆపాదించబడితే, ఇలాంటివి చేయడం ఇక నుంచి వీలుపడదు. అయితే, దీనిపై పూర్తి స్థాయి అప్డేట్ రావాల్సి ఉంది.