LPG Cylinder New Rules: మే 1వ తేదీ నుంచి సిలిండర్ బుకింగ్ మరియు ప్రైస్ లో మార్పులు జరగనున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే, మన దేశంలో పక్కా ప్లాన్ తో గ్యాస్ సరఫరా నిర్వహించడం ద్వారా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చేయగలిగారు. అయితే, మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు అమలుపరిచిన రూల్స్ స్థానంలో కొత్త రూల్స్ ను చేరుస్తున్నట్లు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ కోసం కొత్తగా తెచ్చిన రూల్స్ లో ప్రధానమైనది బుకింగ్ ఇంటర్వెల్. అంటే, ఒక గ్యాస్ సిలిండర్ మరియు మరో గ్యాస్ సిలిండర్ బుకింగ్ మధ్య ఉండే కాల వ్యవధి. ఇప్పటి వరకు పట్టణాల్లో 21 రోజులు మరియు గ్రామాల్లో 45 రోజుల బుకింగ్ గ్యాప్ ని అమలు చేసారు. అయితే, పట్టణాల్లో 25 రోజులకు పే పెంచుతున్నట్లు తెలుస్తోంది.
అంటే, గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయాలంటే పట్టణంలోని గ్యాస్ వినియోగదారులు 25 రోజుల గ్యాప్ ను అలవాటు చేసుకోవాల్సిందే. ఒకవేళ గడువు కంటే ముందు గ్యాస్ బుక్ చేయడానికి ప్రయత్నించినా ఆటోమాటిగ్గా కాల్ బ్లాక్ అవుతుంది. కాబట్టి, అర్బన్ ఏరియాల్లోని ప్రజలు ముందుగానే ప్లాన్ చేసుకుని బుకింగ్ చేయాలి.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, వారు తప్పని సరిగా Aadhaar eKYC తప్పనిసరి చేయాలి. ఇప్పటికే ఆధార్ ఈకెవైసి చేసిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు ఆధార్ ఈకెవైసి అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో కనెక్షన్ నిలిపివేసే అవకాశం కూడా ఉండవచ్చు.
సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ వినియోగదారుల మొబైల్ నెంబర్ కు OTP / DAC కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇవ్వకపోతే సదరు గ్యాస్ కంపెనీ సిలిండర్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఫ్రాడ్ మరియు బ్లాక్ మార్కెట్ తగ్గించడానికి ఈ కొత్త చర్యను తీసుకున్నట్లు చెబుతున్నారు.
మీ ఏరియాలో PNG (పైప్ గ్యాస్) అందుబాటులో ఉంటే మీరు 90 రోజుల్లో PNG కనెక్షన్ కి మారాలి. లేకుంటే, మీ LPG గ్యాస్ కనెక్షన్ నిలిపివేయవచ్చు.
Also Read: OnePlus Nord CE6 Lite: వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
అన్ని గ్యాస్ కంపెనీలు కూడా మెరుగైన కొత్త డిజిటల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ ద్వారా మెరుగ్గా ఉంటుంది మరియు ఫేక్ బుకింగ్స్ తగ్గుతాయి. అంతేకాదు, డెలివరీ కూడా త్వరగా అందుకునే అవకాశం ఉంటుంది.
అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కంపెనీ డొమెస్టిక్ సిలెండర్ పై రూ. 60 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. అయితే, అయితే మే 1వ తేదీ నుంచి ఇతర కంపెనీ రేట్లు కూడా ఎలా ఉంటాయో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే పెరిగాయి మరియు ఇంకా ఉందని చెబుతున్నారు.