iPhone 17 now available at reasonable price on flipkart freedom sale 2026
iPhone 17 ఫోన్ లవర్స్ కు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ అందించింది. 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి లేటెస్ట్ ఐఫోన్ 17 పై గొప్ప డీల్ అందించింది. ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ తో ఐఫోన్ 17 ఫోన్ రీజనబుల్ ధరలో లభిస్తోంది. చాలా కాలంగా ఐఫోన్ 17 డీల్స్ కోసం ఎదురు చూసే వారికి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మంచి అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అందించిన డీల్స్ మరియు ఆఫర్లు గురించి మీరు తెలుసుకుంటే, ఐఫోన్ 17 ఫోన్ ను రీజనబుల్ ప్రైస్ లో పొందవచ్చు.
ఐఫోన్ 17 స్టార్టింగ్ వేరియంట్ ఇండియాలో రూ. 82,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ రోజు కూడా ఆపిల్ స్టోర్ నుంచి ఇదే రేటుతో సేల్ అవుతోంది. అయితే, ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ ఫోన్ ను రూ. 77,900 ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. దీనికోసం రెండు ఆఫర్స్ ని మీరు అందుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల తగ్గింపు ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందరి కోసం అందించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు రూ. 4,000 ఆదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఐఫోన్ 17 మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 77,900 ధరలో లభిస్తుంది.
Also Read : LG 55 Nano Smart Tv అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఆల్ టైమ్ బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!
ఇది యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఐఫోన్ సిరీస్ స్టార్టింగ్ వేరియంట్. యాపిల్ ఈ ఫోన్ ను జబర్దస్త్ కెమెరా సెటప్ మరియు సూపర్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz వరకు ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ ఐల్యాండ్, ట్రూ టోన్, HDR, P3 వైడ్ కలర్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను యాపిల్ న్యూ క్రియేట్ లేటెస్ట్ Apple A19 చిప్ తో అందించింది. ఇది 3nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన చిప్. ఇది గేమింగ్, AI ఫీచర్లు, ఫోటో మరియు వీడియో ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు 512GB ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
కెమెరా సెటప్ విభాగంలో, ఈ ఫోన్ 48MP + 48MP డ్యూయల్ రియర్ మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 60FPS వరకు 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్, 2x టెలిఫోటో జూమ్ మరియు యాపిల్ లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జబర్దస్త్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందించే బ్యాటరీ, USB-C ఛార్జ్ సపోర్ట్ మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది.