6 వేలకే 100 ఇంచ్ స్క్రీన్ Smart Projector లాంఛ్ చేసిన టాప్ బ్రాండ్.!

HIGHLIGHTS

భారత్ మార్కెట్ లో ఈరోజు గొప్ప ప్రోడక్ట్ విడుదలయ్యింది

100 ఇంచ్ స్క్రీన్ అందించ గల మినీ Smart Projector లాంఛ్

ఇది స్మార్ట్ ఫీచర్స్ తో వచ్చే స్మార్ట్ ప్రొజెక్టర్

6 వేలకే 100 ఇంచ్ స్క్రీన్ Smart Projector లాంఛ్ చేసిన టాప్ బ్రాండ్.!

Tech News: భారత్ మార్కెట్ లో ఈరోజు గొప్ప ప్రోడక్ట్ విడుదలయ్యింది. కేవలం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రేటుకే 100 ఇంచ్ స్క్రీన్ అందించ గల మినీ ప్రోజెక్టర్ ను లాంఛ్ చేసింది Lifelong బ్రాండ్. ఈ ప్రముఖ భారతీయ బ్రాండ్ ఈరోజు తన పోర్ట్ ఫోలియోలో LightBeam కొత్త మినీ ప్రొజెక్టర్ ను కూడా జత చేసింది. ఇది స్మార్ట్ ఫీచర్స్ తో వచ్చే స్మార్ట్ ప్రొజెక్టర్ మరియు చాలా కాంపాక్ట్ సైజులో ఆకట్టుకుంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lifelong LightBeam Smart Projector

లైఫ్ లాంగ్ ఈ లిట్ బీమ్ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 6,499 ధరతో విడుదల చేసింది. ఈ ప్రొజెక్టర్ ను అమేజాన్ నుండి Citi-branded Credit Card EMI ట్ కొను గోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. అంటే, 6 వేలకే మీ ఇంటిని సినిమా హల్ గా మార్చే ప్రొజెక్టర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: TWS Buds Offer: చౌక ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!

ఈ Smart Projector ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈ స్మార్ట్ ప్రోజెక్టర్ 720p Full HD విజువల్స్ మరియు 4K కంటెంట్ కి కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రోజెక్టర్ 2500 Lumens (150 ANSI) తో క్రిస్టల్ క్లియర్ విజువల్ ను అందిస్తుందని కూడా లైఫ్ లాంగ్ తెలిపింది. ఈ ప్రోజెక్టార్ Bluetooth 5.2 మరియు లేటెస్ట్ WiFi6 మరియు HDMI వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

lifelong 100 inch Smart Projector
lifelong 100 inch Smart Projector

ఈ స్మార్ట్ ప్రోజెక్టర్ 180° projection angle తో వస్తుంది. అంటే, ప్రోజెక్టర్ ను యూజర్ కు కావలసిన విధంగా యాంగిల్ తిప్పుకునే అవకాశం వుంది. ఈ ప్రోజెక్టర్ లో ఒక 3W స్పీకర్ కూడా వుంది. చవక ధరలో పెద్ద స్క్రీన్ కొరుకునే వారికి తగిన స్మార్ట్ ఫీచర్స్ ట్ ఈ కొత్త ప్రోజెక్టర్ ను తీసుకు వచ్చింది ఈ ఇండియన్ బ్రాండ్.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo