OTT లో లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త సినిమాలను చూశారా..!!

HIGHLIGHTS

OTT లో లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త సినిమాలు

రీసెంట్ గా OTT లో బ్లాక్ బాస్టర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి

ఓటిటీ లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు

OTT లో లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త సినిమాలను చూశారా..!!

ప్రస్తుతం OTT లో లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త సినిమాలను చూశారా? ఒకవేళ చూడకపోయినట్లయితే వెంటనే చూసేయండి. రీసెంట్ గా OTT లో బ్లాక్ బాస్టర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తమిళ హీరో తళ అజిత్ కుమార్ బ్లాక్ బాస్టర్ మూవీస్ భీమ్లా నాయక్ మరియు వలీమై మొదలుకొని చాలా సినిమాలు ఈ వారం ఓటిటీ లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. మరించేందుకు ఆలశ్యం ఓటిటీ లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు గురించి చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ET (ఎతరక్కుమ్ తునిందవన్)

సూర్య నటించిన సూపర్ యాక్షన్ మూవీ ET ఈరోజు Netflix మరియు Sun Next రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ అవుతోంది. తమిళంలో ET (ఎతరక్కుమ్ తునిందవన్) మరియు తెలుగులో ET (ఎవరికి తలవంచడు) పేరుతో వచ్చిన సూర్య యాక్షన్ మూవీ ఈరోజు నుండి OTT లో స్ట్రీమ్ అవుతోంది. పక్కా మాస్ మసాలా మరియు జబర్దస్త్ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, మార్చి 10 న ప్రంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 175 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్ సాధించినట్లు చెబుతున్నారు.

భీమ్లా నాయక్

పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రాణా హీరోలుగా నటించిన ఈ భారీ మల్టి స్టార్ సినిమా AHA మరియు Disney+ Hotstar రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన సందడి చేస్తోంది. ఫిబ్రవరి 25 న థియేటర్లలో విడుదలయ్యి భారీ విజయాన్ని సొంత చేసుకున్న భీమ్లా నాయక్, భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే ఒక రేంజ్ లో వుంది.

వలీమై

బోనీ కపూర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలై సక్సెస్ ను సాధించింది. జీ నెట్‌వర్క్ యొక్క OTT  సైట్ Zee5 లో మార్చి 25 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. తమిళనాట ఈ ఈ సినిమా పైన మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది.

రాధే శ్యామ్

రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు మరియు ఈ చిత్రానికి కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970 ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా చిత్రం. అలాగే, ఈ సినిమాలో విజువల్స్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయని కితాబు అందుకున్నారు.  ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo