Intel AMA
Intel AMA

మీ Whatsapp DP ఫోటో చెక్ చేసిన ప్రతిఒక్కరి వివరాలు కావాలా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Jun 2021
HIGHLIGHTS
  • మీ Whatsapp DP చుసిన వారిని ఈజీగా కనిపెట్టండి

  • మొబైల్ నంబర్ లను కూడా కనిపెట్టొచ్చు

  • కంప్లీట్ లిస్ట్ మీ చేతిలోనే

మీ Whatsapp DP ఫోటో చెక్ చేసిన ప్రతిఒక్కరి వివరాలు కావాలా?
మీ Whatsapp DP ఫోటో చెక్ చేసిన ప్రతిఒక్కరి వివరాలు కావాలా?

Whatsapp ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఎక్కువ మంది ప్రజలు చాలా పనులను వాట్సాప్ ద్వారా చక్కబెట్టేస్తున్నారు. ఆఫీస్ వర్క్ కావచ్చు లేదా స్కూల్ వర్క్ లేదా సన్నిహితులతో పాటుగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండడానికి వాట్సాప్ సహాయం చేస్తుంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా చూసిన కూడా ఎక్కువ శాతం ప్రజలు వాట్సాప్ నే ఉపయోగిస్తున్నారు. మరి అతివంటి వాట్సాప్ లో మన గురించి అందరికి అర్ధమయ్యేలా చెప్పాలంటే మాత్రం Whatsapp DP ఫోటో లేదా Whatsapp స్టేటస్ ద్వారా మన గురించి చెబుతాం.

కానీ, కొన్ని సార్లు మన స్నేహితులు లేదా సన్నిహితులు లేదా మనకు తెలిసిన వారితో మనకు మనస్పర్థలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో, మనం వారిని మన వాట్సాప్ అకౌంట్ నుండి బ్లాక్ చెయ్యడం లేదా తొలిగించడం వంటి పనులు చేస్తాము. అటువంటి సమయంలో మనం డిలీట్ లేదా బ్లాక్ చేసిన వారితో పాటుగా ఇంకా ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో ఇలా తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండవచ్చు. మీ Whatsapp స్టేటస్ ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: know who checked your whatsapp profile by new trick
Tags:
Whatsapp Whatsapp Profile Whatsapp DP new whatsapp update telugu latest news whatsapp new tricks new whatsapp tricks viral news trending news
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status