KGF: చాఫ్టర్ 2 అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోందా..!!

HIGHLIGHTS

KGF: చాఫ్టర్ 2 OTT లో రిలీజ్ కాబోతోంది

KGF చాప్టర్ 2 OTT రిలీజ్ ఆసక్తికర విషయాలు

KGF చాప్టర్ 2 సినిమా OTT కోసం భారీ అమౌంట్

KGF: చాఫ్టర్ 2 అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోందా..!!

రాకింగ్ స్టార్ యష్ ఫుల్ యాక్షన్ మూవీ KGF చాప్టర్ 1 సీక్వెల్ గా వచ్చిన KGF: చాఫ్టర్ 2 బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ పరంగా రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమా ఎప్పుడు OTT లో రిలీజ్ కాబోతోంది, అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి ఈ బ్లాక్ బాస్టర్ మూవీ స్ట్రీమ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, KGF చాప్టర్ 2 సినిమా కోసం భారీ అమౌంట్ ను అఫర్ చేసినట్లు కూడా రూమర్ వుంది. అయితే, ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయం పైన ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా KGF చాప్టర్ 2 OTT రిలీజ్ ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా వస్తుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ సినిమా యొక్క OTT రిలీజ్ డేట్ గురించి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో KGF చాప్టర్ 2 సినిమా OTT కోసం భారీ అమౌంట్ ను అఫర్ చేసినట్టు కూడా నెట్టింట్లో పుకార్లు ఉన్నాయి.            

వాస్తవానికి, ఈ సంవత్సరం ప్రజలు అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో KGF చాప్టర్ 2 ఒకటి. అంతేకాదు, విడుదలైన ప్రతి దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది మరియు ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందనతో KGF చాప్టర్ 1 యొక్క రికార్డ్ బద్దలు కొట్టి, కొత్త రికార్డ్ సృష్టించింది. చిత్ర యూనిట్ ఈ సినిమా చివర్లో అందించిన KGF చాప్టర్ 3 గురించి ఇచ్చిన హింట్ తో ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయ్యింది.

ఇప్పటి వరకూ KGF చాప్టర్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజలు, ఇప్పుడు KGF చాప్టర్ 3 కోసం మళ్ళి ఎదురుచూడాల్సి వస్తుంది. అంటే, యష్ అకా రాకీ భాయ్ ముచ్చటగా మూడవసారి తన యాక్షన్ తో మెరిపించనున్నాడు. ఈ విషయాన్ని థియేటర్లలో వెల్లడించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయడమే కాకుండా, మేకర్స్ ప్రజల దృష్టిని ఖచ్చితంగా ఆకర్షించారు. అంతేకాదు,  KGF ఎక్కడికీ వెళ్లదని కూడా గుర్తు చెయ్యడమే కాకుండా రాకీ భాయ్ కథ ఇంకా కొనసాగుతుందని మరియు మరింత బలంతో తిరిగి వస్తుందని కూడా చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo