KGF CHAPTER 2 కోసం ఎదురు చూస్తున్న వారికి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ అందించింది. రాకింగ్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF CHAPTER 2) విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 2018 లో విడుదలై అతిపెద్ద విజయాన్ని సాధించిన కెజిఎఫ్ చాప్టర్ 1 యొక్క రెండవ భాగం కెజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14, 2022 న సినిమా థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కంటే ముందుగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
KGF చాప్టర్ 2 యొక్క కొత్త ట్రైలర్ ను మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. KGF పార్ట్ 2 లో ఏమి చూడాలనుకుంటున్నారు అని ట్వింకిల్ బ్యానర్స్ 'కెజిఎఫ్' అభిమానుల ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు 85 శాతానికి పైగా అభిమానులు తమకు ట్రైలర్ కావాలని సమాధానం ఇచ్చారు. అందుకే, దీన్ని దృష్టిలో ఉంచుకొని అభిమానుల కోరిక మేరకు మార్చి 27 సాయంత్రం 6:40 గంటలకు KGF ట్రైలర్‌ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.
KGF చాప్టర్ 2 లో సంజయ్ దత్ మొదటిసారిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయనున్నాడు. అలాగే, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.