JioPhone Next: సెప్టెంబర్ 10 నుండి సేల్…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

JioPhone Next ఫోన్ సెప్టెంబర్ 10 నుండి సేల్

అత్యంత చవకయిన 4G స్మార్ట్ ఫోను

ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్

JioPhone Next: సెప్టెంబర్ 10 నుండి సేల్…ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

చాలా కాలంగా రిలయన్స్ జియో ఊరిస్తూ వస్తున్న JioPhone Next  ఫోన్ సెప్టెంబర్ 10 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుందని జియో ప్రకటించింది. రిలయన్స్ 44 వ AGMs మీటింగ్ నుండి ప్రకటించిన ఈ ఫోన్ పైన సేల్ గురించి ఎట్టకేలకు జియో నోరువిప్పింది. వాస్తవానికి, రిలయన్స్ జియో తన 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటిస్తుందని అభిమానులు ఊహించారు. అయితే, 4G ఫోన్ ను మాత్రమే జియో ప్రకటించింది. కానీ, ఈ ఫోన్ గురించి వస్తున్న ఆన్లైన్ లీక్స్ మరియి అంచనా ధర వివరాలను చూస్తుంటే ఈ ఫోన్ అత్యంత చవకయిన 4G స్మార్ట్ ఫోనుగా అవతరించనున్నట్లు కనిపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనికి తోడు, JioPhone Next ఫోన్ ను అందించడానికి ప్రపంచ టెక్ దిగ్గజం Google కూడా చేయికలపడంతో ఈ ఫోన్ పైన అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు ఈ ఫోన్ సేల్ డేట్ ప్రకటించడంతో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఫోన్ గురించి ఇంతగా చర్చిస్తున్న ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందామా.

JioPhone Next: అంచనా ధర మరియు స్పెక్స్ 

ఈ జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అత్యంత చవకధరకే లభించనున్న స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అంటే, ప్రస్తుతం మర్కెట్లో ఉన్న తక్కువ ధరకే లభిస్తున్న 4G స్మార్ట్ కంటే కూడా ఈ ఫోన్ రేట్ మరింత తక్కువగా ఉండాలి. అందుకే, ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ. 4,500 రూపాయల మధ్య ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ అనేది గూగుల్ క్లౌడ్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్‌ఫోన్. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.

ఈ కొత్త సరసమైన 4 జి స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఇంకా 2G నెట్వర్క్ కే  పరిమితపరిమితమైన 300 మిలియన్ల వినియోగదారులను 4జి నెట్‌వర్క్‌కు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. నెక్స్ట్ లెవల్ చందాదారుల వృద్ధి కోసం రిలయన్స్ ఎంట్రీ లెవల్ వినియోగదారుల వైపు మొగ్గు చూపుతోందని కూడా వెల్లడించారు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo