Vivo X300 FE: లాంచ్ కంటే ముందే వివో అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్లు తెలుసుకోండి.!

Vivo X300 FE: లాంచ్ కంటే ముందే వివో అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్లు తెలుసుకోండి.!

Vivo X300 FE: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ 300 FE లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ ఈరోజు అందిస్తున్నాము. వివో ప్రీమియం సిరీస్ నుంచి రాబోతున్న ఈ అప్ కమింగ్ స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని వివో కన్ఫర్మ్ చేసింది. స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో అద్భుతమైన కెమెరా ఫీచర్ తో లాంచ్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo X300 FE: లాంచ్ డేట్

వివో ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ మే నెల ఆరవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయబడుతుంది.

Vivo X300 FE: టాప్ ఫీచర్స్

డిజైన్

ఈ స్మార్ట్ ఫోన్ కంఫర్టబుల్ గ్రిప్ డిజైన్ లో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లీక్ గా మరియు 191 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుంది.

ప్రోసెసర్

ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది హై ఎండ్ గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ కోసం తగిన చిప్ సెటప్. దీనికి జతగా పెద్దా LPDDR5x ర్యామ్ మరియు UFS 4.1 హై స్పీడ్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

OS

ఈ ఫోన్ origin OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 5 సంవత్సరాల OS అప్గ్రేడ్స్ మరియు 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

కెమెరా

కెమెరా పరంగా ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ మరియు ఫీచర్లు కలిగి ఉంటుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో (3x జూమ్) మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెర్స్ ఏటప్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

Vivo X300 FE top features

ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్, ఏఐ క్రియేటివ్ కెమెరా మరియు ZEISS మల్టీ ఫోకల్ పోర్ట్రైట్ వంటి చాలా ప్రీమియం కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: 7 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Soundbar డీల్స్ ఇవిగో.!

బ్యాటరీ

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలు కూడా ముందుగానే వెల్లడించింది. ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, 40W వైర్లెస్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ అప్స్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా వివో త్వరలో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్‌డేట్స్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo