JioBook: 15 వేలకే జియో ల్యాప్ టాప్.. డోంట్ మిస్ ది ఛాన్స్.!

Updated on 23-Oct-2022
HIGHLIGHTS

JioBook ఈ దీపావళి పండుగ సందర్భంగా మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

రిలయన్స్ జియో సరికొత్తగా ఆవిష్కరించిన జియో ల్యాప్ టాప్ JioBook

డిస్కౌంట్ తో Reliance digital Store నుండి రిలయన్స్ సేల్ చేస్తోంది

రిలయన్స్ జియో సరికొత్తగా ఆవిష్కరించిన జియో ల్యాప్ టాప్ JioBook ఈ దీపావళి పండుగ సందర్భంగా మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. IMC 2022 నుండి జియో ఆవిష్కరించిన జియో బడ్జెట్ ల్యాప్ టాప్ JioBook ఇప్పుడు అందిరికి అందుబాటు ధరలో లభిస్తోంది. ప్రారంభంలో 19,500 రూపాయల ధరతో ప్రకటించిన ఈ జియోబుక్ ఇప్పుడు 3,700 రూపాయల డిస్కౌంట్ తో Reliance digital Store నుండి రిలయన్స్ సేల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ కొత్త ల్యాప్ టాప్ ధర, స్పెక్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందామా.

JioBook: ధర మరియు ఆఫర్లు

JioBook ను ముందుగా రూ.19,500 ధరతో ఇది ప్రభుత్వ ఇ-మార్కెట్‌ ప్లేస్ (GeM) లో లిస్టింగ్ చేసింది. అయితే, ఇప్పుడు జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.15,799 రూపాయల ధరతో సేల్ చేస్తోంది.  జియోబుక్ ను Reliance digital Store నుండి అందరికి అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్/డెబిట్ కార్డ్  అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే,15 వేల కంటే తక్కువ ధరకే జియో ల్యాప్ టాప్ సేల్ ను మీరు పొందవచ్చు.          

JioBook: స్పెక్స్ మరియు ఫీచర్లు

ముందుగా, జియోబుక్ యొక్క డిస్ప్లేతో ప్రారంభిద్దాం. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్‌లైటింగ్‌తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవచ్చు.

జియోబుక్ లేటెస్ట్ JioOS పైన నడుస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేక ఉండదా అనే విషయం పైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ యాడ్ బ్రౌజర్ వంటి కొన్ని ముందే ఇన్‌స్టాల్ చెయ్యబడిన యాప్‌లను మీరు ఈ ల్యాప్ టాప్ తో పొందుతారు మరియు జియో క్లౌడ్ PC కి కూడా సపోర్ట్ ఉంది.

ఇక ఇతర ఫీచర్లు మరియు కనెక్టివిటీ విషయానికి వస్తే, JioBook లో 4G సపోర్ట్, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లు ఉన్నాయి. ఇక జాబితా చేయబడిన బ్యాటరీ పరిమాణం 55.1 నుండి 60 AH వరకు వుంటుంది మరియు ఇది 8 గంటల వరకుబ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. ఈ జియో ల్యాప్ టాప్ లో మీరు డ్యూయల్ స్పీకర్ సెటప్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్ సెటప్ మరియు స్టాండర్డ్ నో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా పొందుతారు. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :