HIGHLIGHTS
JioPhone Next లాంచ్ డేట్ వచ్చేసింది
అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్
JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని చెబుతున్నారు
చాలా రోజుగా ఎదురుచూస్తున్న JioPhone Next లాంచ్ డేట్ వచ్చేసింది. జియో మరియు గూగుల్ సంయుక్తంగా తీసుకువచ్చిన ఈ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10 నుండి, అంటే రేపటి నుండి మార్కెట్లో అమ్మకాలను కొనసాగించనున్నదని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, జియో ఇప్పటికే తన రిటైల్ పాట్నర్స్ తో చర్చలు ప్రారంభించిందని కూడా తెలుస్తోంది.
Surveyఇక గతంలో వచ్చిన అనేక నివేదికల ప్రకారం, JioPhone Next ధర రూ. 3,499 కావచ్చని చెబుతున్నారు, భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్ అమ్మకం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చిన లీక్స్ కూడా ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ.4,500 మధ్యస్థంగా ఉండవచ్చని సూచించాయి. అయితే, ఈసారి మాత్రం క్లియర్ ప్రైస్ డిటైల్స్ ని లీక్స్ టిప్‌స్టర్ ద్వారా వెల్లడించినట్లు ఊహిస్తున్నారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ గురించి ఆన్లైన్లో వచ్చిన అనేకమైన లీక్స్ ద్వారా ఈ ఫోన్ 5.5-అంగుళాల HD డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు Qualcomm QM215 చిప్‌సెట్‌తో రావచ్చు. అలాగే, ఈ ఫోన్ 2GB లేదా 3GB RAM తో రావచ్చు మరియు ఇది 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు ఈ JioPhone Next లో చేర్చబడ్డాయి. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో కూడా వస్తుంది.