జియో ధమాకా అఫర్: రూ.119 రూపాయల ప్లాన్ తో Airtel మరియు Vi కి భారీ పోటీ ఇచ్చిన జియో

HIGHLIGHTS

Jio కొత్త ప్లాన్ ను తక్కువ రేటుకే అందించింది

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది

అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది

జియో ధమాకా అఫర్: రూ.119 రూపాయల ప్లాన్ తో Airtel మరియు Vi కి భారీ పోటీ ఇచ్చిన జియో

జియో లేటెస్ట్ ప్లాన్ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ లకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే, జియో డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా అన్ని ప్రయోజాలతో కొత్త ప్లాన్ ను తక్కువ రేటుకే అందించింది.వాస్తవానికి, వోడాఫోన్ ఐడియా తక్కువ ధర ప్లాన్ లలో SMS సౌకర్యాన్ని అందించడం లేదని కొద్ది రోజుల క్రితం జియో నేరుగా TRAIకి ఫిర్యాదు చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనికి అనుగుణంగానే ఇతర టెలికం కంపెనీల పైన మరింత భారాన్ని పెంచేలా తన రూ.119 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లో 300 ఉచిత SMS సౌకర్యాన్ని కూడా జతచేసింది.  ఇక ఈ మూడు కంపెనీల అఫర్ చేస్తున్న చవక అన్లిమిటెడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.

జియో రూ.119 ప్లాన్

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 21 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

SMS సర్వీస్ తో వచ్చే Vi చవకైన ప్లాన్

SMS తో జతగా వచ్చే Vi యొక్క చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.179 ధరలో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 2 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అలాగే, Vi Movies & TV బేసిక్ సభ్యత్వం అందుబాటులో ఉంది.

SMS సర్వీస్ తో వచ్చే ఎయిర్టెల్ చవకైన ప్లాన్

SMS సర్వీస్ తో వచ్చే ఎయిర్టెల్ చవకైన ప్లాన్ రూ.155 రూపాయలలో వస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 1 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, 300 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ Prime Video ఉచిత ట్రయిల్, ఫ్రీ hello Tunes మరియు Wink Music కి ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo