జియో నుండి మరొకసారి బంపర్ అఫర్
Jio బంపర్ అఫర్
కేవలం రూ. 47 ధరకే రౌటర్
JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్
ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ క్లాసులు చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. అందుకే, దీన్ని దృష్టిలో ఉంచుకొని Jio మరొకసారి బంపర్ అఫర్ ప్రకటించింది. అందరూ ఇంటికే పరిమిత అవ్వడం వలన అందరి కనెక్టివిటీ కోసం WiFi పైన ఆధారపడుతున్నారు. అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు.
Surveyఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది. అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile