రోజుకి రూ.2.70 పైసలకే కే జియో అన్లిమిటెడ్ సర్వీస్!! జియోఫోన్ కూడా ఉచితంగా ఇస్తుంది!

రోజుకి రూ.2.70 పైసలకే కే జియో అన్లిమిటెడ్ సర్వీస్!! జియోఫోన్ కూడా ఉచితంగా ఇస్తుంది!
HIGHLIGHTS

జియో కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్

జియో యొక్క 4G జియోఫోన్ ఉచితం

రెండు సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీస్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం, ఇటీవల ఒక అద్భుతమైన ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ను జియోఫోన్ 2021 ఆఫర్ గా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు పూర్తిగా 24 నెలలు అన్లిమిటెడ్ ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు, జియో యొక్క 4G జియోఫోన్ ను ఉచితంగా అందుకునే అవకాశం వుంటుంది. అంటే, ఈ అఫర్ ద్వారా తక్కువ ధరకే ఒక కొత్త జియోఫోన్ ని మరియు రెండు సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీస్ ని కూడా పొందవచ్చు.             

జియోఫోన్ 2021 ఆఫర్

అతిపెద్ద  టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే, దీని కోసం రూ .1,499 చెల్లించాల్సి ఉంటుంది.

పైన తెలిపిన ఈ ప్రయోజనాలను కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కాదు, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి. రోజువారీ ఉపయోగం కోసం.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo