రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గొప్ప శుభవార్త ప్రకటించింది. భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టికెట్ బుకింగ్ సిస్టం ను మరింత వేగవంతంగా మరియు ప్రజల సౌకర్యార్థం మరింత అనుకూలంగా మార్చేందుకు కొత్త బీటా వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెర్షన్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన అనుభవం కల్పించడమే కాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ కొత్త IRCTC New Beta Website తో టికెట్ బుకింగ్ మరింత వేగంగా మరియు సులభంగా మారుతుంది.
కొత్త ఐఆర్‌సీటీసీ బీటా వెబ్ సైట్ లో అత్యంత పెద్ద మార్పు యూజర్ ఇంటర్ ఫేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, పాత వెబ్ సైట్ తో పోలిస్తే కొత్త వెబ్ సైట్ డిజైన్ మరింత క్లీన్ గా మరియు సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. అవసరం లేని పాప్ అప్స్, ఎక్కువగా వచ్చే క్యాప్చా ధృవీకరణ వంటి అంశాలను తగ్గించడం వల్ల టికెట్ బుకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇందులో ఉన్న మరో సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, ఒకే స్క్రీన్ లో వివిధ తరగతుల సీట్ల లభ్యతను చూసే సౌకర్యం కల్పించారు. ఇలా చేయడం ద్వారా ప్రతి క్లాస్ ను విడివిడిగా వెతకాల్సిన అవసరం తగ్గుతుంది మరియు ప్రజలకు ఇది సమయం వృధా కాకుండా చూస్తూ`చేస్తుంది. అంతేకాదు, పేజీలు వేగంగా లోడ్ అయ్యేలా సాంకేతికంగా మెరుగుదలలు చేశారు. ఈ టెక్ తో అధిక రద్దీ సమయాల్లో కూడా వెబ్ సైట్ పనితీరు మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఒకేసారి లాగిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇలా చేయడం వల్ల ప్రతి నిమిషానికి ఎక్కువ టికెట్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ మార్పులు టికెట్ బుకింగ్ లో ఎదురయ్యే ఆలస్యం మరియు సాంకేతిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
Also Read: ZEBRONICS పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!
ప్రస్తుతం విడుదలైనది కేవలం బీటా వెర్షన్ మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత అవసరమైన మార్పులు చేసి పూర్తి స్థాయి వెబ్ సైట్ ను ఐఆర్‌సీటీసీ త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ అప్‌డేట్ భారతీయ రైల్వే డిజిటల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా తీసుకున్న కీలక పరిణామం గా పరిగణిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, కొత్త ఐఆర్‌సీటీసీ బీటా వెబ్ సైట్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా, వినియోగదారులకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, తత్కాల్ టికెట్ బుక్ చేసే ప్రయాణికులకు ఈ మార్పు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.