ZEBRONICS పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్

బడ్జెట్ ధరలో ZEBRONICS పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు

ఈ సౌండ్ బార్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు ఫుల్ సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది

ZEBRONICS పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!

కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల ముగిసిన బార్ సేల్ తర్వాత కూడా మీరు ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో ZEBRONICS పవర్ ఫుల్ 5.1 Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ 525W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు ఫుల్ సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. కేవలం 6 వేల బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ కోసం వెతుకుతుంటే, ఈ సౌండ్ బార్ డీల్ ను మీరు పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ Deal ఎక్కడ లభిస్తుంది?

ఈ సౌండ్ బార్ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. అదేమిటంటే, నిన్న మొన్నటి వరకు రూ. 8,999 రూపాయల ధరలో సేల్ చేసిన జెబ్రోనిక్స్ 5.1 డాల్బీ సౌండ్ బార్ Juke Bar 9400 Pro ను ఈరోజు రూ. 2,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 700 రూపాయల అదనపు Federal బ్యాంకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ZEBRONICS 5.1 Dolby soundbar deal

ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 రూపాయల ఆల్ టైమ్ చీప్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈరోజు లభించే ప్రైస్ లో గొప్ప సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: Swiggy Instamart లో ఇక నుంచి LPG సిలిండర్ కూడా తక్షణమే అందుకోండి.!

ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప ఆకట్టుకునే డిజైన్ తో వస్తుంది మరియు టోటల్ వైర్ సెటప్ తో ఉంటుంది.

సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు 5.1 డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ మీకు ఇంట్లో సినిమా థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, బ్లూటూత్, AUX మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ వాల్యూమ్, మీడియా కంట్రోల్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది.

ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఆఫర్ ప్రైస్ లో ఇది బెస్ట్ 5.1 డాల్బీ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile