Swiggy Instamart లో ఇక నుంచి LPG సిలిండర్ కూడా తక్షణమే అందుకోండి.!
Swiggy Instamart మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది
LPG సిలిండర్ ను ఇంటి వద్దకే అందించే గొప్ప సర్వీస్ ను ప్రారంభించింది
HPCL తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ కొత్త సర్వీస్ అందించింది
దేశంలో క్విక్ కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో Swiggy Instamart మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తో భాగస్వామ్యం కుదుర్చుకుని, అవసరమైన సమయంలో LPG సిలిండర్ ను ఇంటి వద్దకే అందించే గొప్ప సర్వీస్ ను ప్రారంభించింది. గృహ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడమే ఈ కొత్త సర్వీస్ ప్రధాన ఉద్దేశం అని స్విగ్గి తెలిపింది.
SurveySwiggy Instamart : HPCL LPG సిలిండర్ డెలివరీ
HPCL తో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్విగ్గీ తన ఇన్స్టామార్ట్ ద్వారా ఈ కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు ఇన్స్టామార్ట్ యాప్ లోనే HPCL కు చెందిన HP Navya Composite LPG Cylinder ను బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ కోసం ముందుగా బుకింగ్ చేసి, డెలివరీ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త విధానంలో క్విక్ కామర్స్ మోడల్ ను ఉపయోగించి తక్కువ సమయంలోనే సిలిండర్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
HP Navya Composite LPG సిలిండర్ ప్రత్యేకత ఏమిటి?
HP నవ్య కాంపోజిట్ LPG సిలిండర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే తక్కువ బరువుతో ఉంటుంది. తుప్పు పట్టకుండా ఉండటంతో పాటు, పారదర్శకంగా ఉండే బాడీ కారణంగా సిలిండర్ లో మిగిలిన గ్యాస్ పరిమాణాన్ని సులభంగా చూడవచ్చు. దీంతో వినియోగదారులు గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది.

ఈ సర్వీస్ ను మొదటిసారిగా ఉపయోగించే వారు కొత్త సిలిండర్ కొనుగోలు చేసినట్లు పరిగణించబడతారు. అనంతరం అదే సిలిండర్ కు రీఫిల్ ను ఇన్స్టామార్ట్ ద్వారానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి డెలివరీ సమయం మరియు సర్వీస్ లభ్యత మారవచ్చు.
ఇప్పటి వరకు క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్ లు కేవలం కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, మందులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటి ఉత్పత్తులను మాత్రమే క్విక్ డెలివరీ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు LPG సిలిండర్లను కూడా ఈ జాబితాలో చేర్చడం ద్వారా వినియోగదారుల రోజువారీ అవసరాలు మరింత వేగంగా తీర్చే దిశగా క్విక్ కామర్స్ అడుగులు పడినట్లు మనం చూడవచ్చు.
ఈ స్విగ్గీ మరియు HPCL భాగస్వామ్యంతో అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అయిపోయినప్పుడు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. అలాగే, డిజిటల్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారుతుంది. భవిష్యత్తులో ఈ సర్వీస్ ను మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా కూడా చెబుతున్నారు. సులభమైన బుకింగ్ అనుభవం మరియు ఆధునిక కాంపోజిట్ సిలిండర్ ప్రయోజనాలు ఒకే వేదికపై అందించడం ఈ సర్వీస్ ప్రత్యేకతగా నిలుస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
